ఇక నుంచి ఖమ్మం లో 10,000 విలువ చేసే వస్తువు విజయవాడలో 8,000 అట!
జై తెలంగాణా అని పదేళ్ళు పోరాడినందుకు తెలంగాణా వారికి "హైదరాబాద్ సహిత" తెలంగాణా ప్రసాదించినందుకు మేడం సోనియాను వేనోళ్ళ కిర్తిస్తున్నారు తెలంగాణా రాజకీయ నాయకులు . కొందరైతే ఏకంగా ఆమెకు గుడులు కట్టి రోజువారి పూజలు చేయాలని కూడా పిక్స్ అయి పోయారు . కాని ఇన్నాళ్లు పోరాడినందుకు పాడి ఆవు తెలంగాణా కు దక్కినా , పాల రేట్లు మాత్రం సిమాంద్ర కు తగ్గిoచడo వలన దాని ప్రబావం తెలంగాణా మార్కెట్ ను నిర్వీర్యం చేయక మానదు అని పిస్తుంది . అది ఎలాగో చూదాం . ప్రజలు ఇంటి ఆవసరాలు కు వాడే వస్తువుల మిద సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ విదిస్తుంది . ఉదాహరణకి ఒక టెలివిజన్ ను మనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే , దానిలో సుమారు 1200 రూపాయల నుంచి 1400 రూపాయల దాక సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ కె పోతుంది . అలాగే ఇంకా చిన్నా చితక , అన్ని కలిపి సుమారు రెండు వేల దాక కేంద్ర ప్రబుత్వం వారికి కట్...