పాతిక మందిలో లేని సమైక్యతా ,5 కోట్ల మందిలో ఉందనడం ఆత్మ వంచన కాదా ?
ఇన్నాళ్ళు సీమాంద్రా కాంగ్రెస్ వారందరూ సమైఖ్య వాదులని యావత్ భారత దేశ ప్రజలను తమ మోసపు మాటలతో మబ్య పెడుతూ వస్తున్న , సీమాంద్రా కాంగ్రెస్ నాయకుల భండారం , నిన్నట్టి అవిశ్వాస తీర్మాన నోటిసుతో బట్ట బయలు అయింది. భారత పార్లమెంటులో సిమాంద్రా ప్రాంతం నుంఛి 25 పార్లమెంటు సీట్లు ఉంటే, తెలంగాణా నుంచి 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం రాజకీయ పరమైనది. దానికి ప్రజల మనోబావాలు తో పని లేదు . ఒకవేళా మెజార్టీ లేదా నిర్దిష్ట ప్రమాణాలు తో కూడిన ప్రజల మనోబావాలు పరిగణనలోకి తీసుకోవాలి అని రాజ్యాంగం లో పొందుపరచబడి ఉన్నట్లైతే , ఈ రోజు తెలుగు ప్రజలు కు ఇన్నీ డ్రామాలు చూడాల్సిన అగత్యం ఉండేది కాదు. కానీ ఇటువంటి రోజు వస్తుందని ఆ నాటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి ఉండరు. ఈ నాటి రాజ్యాంగ నిర్మాతలకు అంత ఆలోచనా చేసే బుద్దితో పాటు తీరిక కూడా లేదు. అందుకే ...