గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా! మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ) ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి ప...