గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !
మీకొక కధ చెపుతాను . అనగనగా ఒక అమెరికన్ తాత . ఆ తాత వయస్సు 68 ఏండ్లు . ఆ తాత గారికి యవ్వనం లో ఉన్నప్పుడు ఒక పెండ్లి , మధ్య వయసు లో మరొక పెండ్లి జరిగింది. మొదటి పెండ్లాం తన పిల్లలు తో సహా అతడిని విడిచి వెళ్లి పొతే , రెండవ పెండ్లి చేసుకోవలసి వచ్చిoది . ఆ తర్వాత ఆ రెండవ ఆవిడ కూడా ఈయన దగ్గర డబ్బు లేదని విడాకులు తీసుకుని వెళ్లిపోయింది . ఎలాగో బ్రతుకు ఈడుస్తూన్న ఆయనకు 68 ఏండ్లు వచ్చాయి . గత ఏడాది అదృష్టం వరించి ఒక లాటరీ తగిలి కోటీశ్వరుడు అయ్యాడు. దానితో వయసులో పొందలేని ఆనందాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకుని తగిన వధువు కోసం డేటింగ్ సైట్లు చూడటం మొదలెట్టాడు . అలా డేటింగ్ సైట్లు చూస్తున్నప్పుడు...