కుటుంబ సమస్యల పై న్యాయ సలహాల కోసం "మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్" పేజీ
మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్ పేజీ (పోస్ట్ ) ద్వారా న్యాయ సలహాలు లు పొందు విధానం ఎవరైనా సరే కుటుంబ సమస్యలతో సతమత మవుతూ , తగిన న్యాయ సలహా కావాలని కోరుకుంటుంటె , వారికి ఈ కౌన్సెలింగ్ పేజీ సహాయపడుతుంది . మీ మీ సమస్యలను క్లుప్తంగా , అర్ధమయ్యే రీతిలో తెలుగులో టైప్ చేసి క్రింది వ్యాఖ్యల (కామెంట్ ) ల బాక్స్ లో షేర్ చేసినట్లైతే అవి ఈ మెయిల్ ద్వారా మాకు చేరటం వలన , వాటిని మేము పరిసీలించుటకు అవకాశం కలుగుతుంది . అలాగే మీ సమస్యలకు న్యాయవాదులుగా మాకున్న అనుభవంతో మరియు పెద్దలతో సంప్రదించి మీకు తగిన సలహా సూచనలు ఇవ్వగలమని బావిస్తున్నాం. అంతే కాక ఈ బ్లాగు ద్వారా ఎవరైనా అనుభవజ్ఞులు మీ సమస్యను చూస్తె వారు కూడా మీకు ప్రత్యుత్తర రూపంలో తగిన సలహాలు ఇవ్వడానికి అవకాశం కలుగును. ఒకవేళ ఎవరైనా పదిమందికి తమ సమస్య తెలియటం ఇష్టం లేకపోతే వారు , ఈ బ్లాగు సైడ్ బార్(sidebar ) లో ఉన్న "సంప్రదింపు ఫారం "(Contact Form) ను పూరించి సమస్యను సందేశం అని ఉన్న...