"అమ్మ " లను కోసి పారేస్తున్న "విజ్ఞాన వైద్యులు "" !!?
"మానవత్వ హీనమైన శాస్త్రీయ విజ్ఞానం "సప్త మహా పాపములలో ఒకటి అన్నారు జాతిపిత మహాత్మా గాంది . అది నిజమని రుజువు చేస్తున్నారు ఖమ్మం లోని వైద్యులు కొందరు. అప్కోర్స్ ఇది ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమైన పాపం కాదు , దేశమంతటా ఇదే పరిస్తితి కొనసాగుతుంది . ఆ పాపమేమిటో తెలుసుకోండి . మొన్నీ మధ్య సాక్షి మహా రాజ్ అనే హిందూ వాది ,బవిష్యత్ లో తమ మతం , అన్యమతాల మద్య ఉండబోయే జనాభా నిష్పత్తి గురించి అందోళన చెంది , ప్రతి హిందూ స్త్రీ 4 పిల్లల్ని కనాలని పిలుపు నిస్తే , అలా పిలుపునివ్వడమే అమ్మ తనానికి అవమానమని, స్త్రీలు 4 పిల్లల్ని కనడం అంటె ఎన్నో రెట్లు బాద అనుభవించడం అని , ఇద్ది దారుణ మైన అమానవీయ చర్య అని "విజ్ణాన వాదులం " అని విర్రవీగుతున్న కొంత మంది విరచుకు పడ్డారు . వారు అలా...