"ఆయనోస్తున్నాడు"! ఎవరాయన ?
ఈ మద్య అన్ని చాన్నల్లలో రాజకీయ పార్టీల ఎన్నికల అడ్వర్ టైస్ మెంట్లు ఎక్కువయ్యాయి .గతం లో తాము చేసిన గొప్ప పనులను ఏకరువు పెడుతూ , ఈ సారి అధికారం తమకిస్తే ఇంకా గొప్పగా చేసి చూపిస్తాం అని కొంతమంది ఊదరగొడుతుంటే , తమ తాతలు, తండ్రులు చేసిన పనులను ఏకరువు పెడుతూ , వారు తాగిన నేతులు కంటే మా మూతుల వాసన బాగుంటుందని చెప్పే వారు కొందరు . ఏది ఏమైనా నూరు అబద్దాలు అడి అయినా ఒక పెండ్లి చేయాలి అన్నారు పూర్వ కాలపు పెద్దలు . కోటి అబ్బాద్దాలు అది అయినా కోరుకున్న పదవి దక్కించు కోవలసిందే అoటున్నారు నేటి రాజకీయ నాయకులు . ఏది ఏమైనా ఇది ఎలెక్షన్ కాలం కాబట్టి ఎవరి గోల వారిది . ఎవరి పార్టిని వారు సమర్దిమ్చుకోక తప్పదు , ఎదుటివారు ఎంత మంచివారైనా విమర్సించక తప్పదు . ఈ మద్య అన్ని రాజకీయ పార్టీల అడ్వర్టైస్ మెంట్లు కంటే "ఆయనోస్...