29 యేండ్ల తల్లిని కాల్చి చంపిన 2 యేండ్ల కొడుకు !
విజ్ఞానం విపరీతంగా పెరిగిపోయిన నేటి "రాకెట్ " ల యుగంలో దేనినైనా శాస్త్రీయ దృక్పదంతో చూడాలని ,విది ,ఖర్మ అని సరిపెట్టుకోవడం మూడత్వం అని విజ్ఞాన వాదులు అంటుంటారు .వారు చెప్పే శాస్త్రీయ ద్రుక్పదమే మానవ సమాజాన్ని ఇంతవరకు తీసుకు వచ్చిందని అనడంలో ఎవరికీ అబ్యంతరం ఉండదు కాని ,ప్రతి సంఘటనకు సైన్స్ లేక శాస్త్రీయ విదానం సంతృప్తి కరమైన సమాదానం ఇస్తుంది అనడం మాత్రం ఏకీభవించలేని విషయం. కొన్ని కొన్ని సంఘటనలు ,దుర్ఘటనలు చూస్తున్నప్పుడు ,వింటున్నప్పుడు, మనిషి విది ఆడె నాటకంలో ఒక బాగమే అని అనిపిస్తుంది .ఇక్కడ విది అంటె మానావతీత "సూపర్ డిజైన్ ".లేక మాస్టర్ ప్లాన్ క్రియేటర్ . విశ్వమంతా ఆ డిజైన్ కు లోబడే నడుస్తుంది తప్పా వేరుగా కాదు . కర్మ సిద్దాంతం ప్రకారం ఒక్కప్పుడు నీవు చేసిన క్రియ ల పలితానే ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నది . దినిని సమర్దించే , ...