Posts

Showing posts with the label సిగ్గులేని పెండ్లి కూతురు

సిగ్గులేని పెండ్లి కూతురు చిందేస్తూ వచ్చ్చిందట !!

Image
  బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే కళ్యాణ శోభ కనగానే కనులార తనివితీరేనే ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే..ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు చెరిగేనే ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే మనసైన వాడు వరుడు నీ మదినేలు వాడె ఘనుడు వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే ఊ –ళ ళ ళ –హాయి....... బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే   సాంప్రదాయపు  వివాహ  పద్దతిలో పెండ్లికూతురు కళ్యాణ మండపం కి తరలివచ్చే విధానం ని పై పాటలో రచయిత శ్రీ అనిసెట్టి సుబ్బారావు గారు చక్కగా చెప్పారు. ఇప్పటికి తెలుగునాట జరిగే సాంప్రదాయ పెండ్లిళ్లలో అమ్మాయి కళ్యాణ మండపం కి బంధువులు ,స్నేహితురాళ్ళు  వెంటరాగా , కొంత...