Posts

Showing posts from December, 2016

అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

Image
నూతన సంవత్సరంలో తొలి రోజు .తొలిరోజు లో మొదటి క్షణాలకు కు మనం స్వాగతం చెప్పే విదానం ఎలా ఉండాలి ?ప్రజలందరూ ఆనందంగా గడచి పోయిన సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ,వస్తున్న సంవత్సరానికి ఆహ్వానం పలకాలి . అసలు పాత సంవత్సరo  చీకటిలోదొంగలా  వెళ్ళిపోవడం ,కొత్త సంవత్సరంఅదే  చీకట్లో మరో దొంగలా రావడం,దానికి మనమేమో పుల్ గా మందు కొట్టి ,ఒళ్ళు పైనా తెలియని స్తితిలో ,పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ ,స్వాగతం పలకడం చూస్తుంటె ,ఇదేదో నిశాచరులు  చేసుకునే  పండుగ లాగుంటుంది కాని ,పౌరులు చేసుకునే పండుగ లాగుంటుందా?

                           రాత్రంతా తాగి ఉగడం ,వాగడం ,అర్దరాత్రి 12 గంటలు సమయంలో నిద్రమత్తులో సామాన్యులు ,నిషా మత్తులో 'మందు మాన్యులు " ,నానా కష్టపడుతూ హ్యాపి న్యూ యియర్ అంటూ స్నేహితులకు ,బందువులకు శుభాకాంక్షలు తెలిపి,వెంటనే మంచం మీద బొక్క బోర్లా పడుకుని తెల్లారి 10 అయినా లేవ లేక పోవటం, రాత్రి తాగిన దానితో వచ్చిన హంగోవర్ ని వదిలించుకోవడానికి మళ్ళి మందు కొట్టాల్సి రావడం, ఇలా మొత్తానికి కొత్త సంవత్సరం రోజంతా ఏదో ఒక మత్తులోనే గడపాల్సి రావడం ,ఇదా నూతన సంవత్సర ఆహ్వాన విదానం ?

మనకు …

మర మనిషి (Robot ) తో కాపురం చేయడమే "మై ఛాయిస్ " అంటున్న ఆధునిక మహిళ లిల్లీ !

Image
అనుకున్నంత అయింది . "మనువు" కు అర్ధమే మారిపోయే దుస్థితి దాపురించింది.  వివాహం అంటే సహజ పద్దతిలో కుటుంబ అభివృద్ధి కోసం స్త్రీ పురుషులు  మధ్య జరిగే సామాజిక పరమైన ఒప్పందం ని తెలియచేసే తంతు . ప్రపంచ వ్యాప్తంగా వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరిగే ప్రక్రియయే . వివాహం యొక్క ప్రధానోద్దేశ్యం లో ముఖ్యమైనది  సహజ పద్దతిలో సంతానం  పొందడం ద్వారా తమ వంశ పారంపర్యతను కొనసాగించడం . మన హిందూ వివాహ చట్టం ప్రకారం  అయితే  వివాహం కి క్రింది షరతులు వర్తిస్తాయి  :


(1)   వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది.
(2)వధూవరులకు గతంలోనే వివాహమైన పక్షంలో వారి భార్త లేదా భర్త జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు. ఈ షరతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహాన్ని బహుభార్యత్వం అనే నేరంగా పరిగణిస్తారు.  (3). వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది.
 (4)వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ…

"మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!

Image
ఈ మద్య కాలంలో "రసాయనిక మగవాళ్లు" ఎక్కువైయారు.అటు యువతలో, ఇటు మద్య వయస్సు వారిలో కూడ ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉన్నారు.అదేమిటంటె, ఎంతమంది స్త్రీలతో ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉంటే,అంత గొప్ప మగవాడు అని.

   నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు . అతను ఒక హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. బార్యా, ఇద్దరు ఆడ పిల్లలు. బార్య బాగానే ఉంటుంది. కాని ఇతనికి పర స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతను గంటల తరబడి ఇతర స్త్రీల తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇతరులెవరఈనా అది చూసి జెలసీ ఫీలవుతా ఉంటే, ఇతను గొప్పగా మురిసి పోయే వాడు. ఎప్పూడూ ఫ్రెండ్స్ తో కలిసిన తన "రసిక" పురాణాం చెపుతూ గొప్పలు పోయే వాడు. నేను చాలా సార్లు మందలించాను. ఇతర స్త్రీల కోసం నువ్వు చూపే శ్రద్ద, డబ్బు దుబారా తగ్గించి, అది కుటుంబం కోసం వినియోగిస్తే బాగుంటుంది కదా అని. దానికి అతను తను ఒక్క నయా పఈసా ఖర్చు చెయ్యనని, తనంటే ఇష్ట పడే స్త్రీలే తనకు ఎదురు డబ్బులు ఇస్తారని చెపితే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. వాడు చెప్పే ఆ మాటలు నిజమా అని పించేది. సరే నీ కర్మ అని అతని మానాన అతన్ని వదలి వెయ్యడం అయినది.ఆ తర్వా…

పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి డిల్లీ కోర్టు వారి తీర్పు!.

Image
"వివాహానికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం ని ప్రపంచం లోని ఏ మత  విదానాలు అనుమతించలేదు కాబట్టి అది ఖచ్చితంగా అనైతికం అవుతుంది. అంతే కాదు పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాలు కలిగి ఉండడం నేరం కాదు అని గతంలో సుప్రీంకోర్టువారు "కుష్బూ " కేసులో స్పష్టం చేసినందున ,అటువంటి పనిని అత్యాచారం క్రింద కూడా పరిగణించ లేము " అని డిల్లీ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీ వీరెందర్ భట్ స్పష్టం చేశారు. పెండ్లికి ముందు తనను పెండ్లి చేసుకుంటాను అని ప్రమాణం చేసిన తర్వాతే తాను ప్రేమించిన  వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నాను అని , కానీ దానీ తర్వాత ఆ వ్యక్తీ తనను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని , కాబట్టి తన మీద అత్యాచారం చేసినట్లేనని అని వాదించిన బాదితురాలి వాదనతో కోర్టు వారు అంగీకరించలేదు.ఆ వ్యక్తీ చేసింది అత్యాచారం కాదని , కేవలం ఇష్ట పూర్వక లైంగిక సంబంద ప్రక్రియ మాత్రమే అని  సెషన్ జడ్జ్ జడ్జ్మెంట్.ఇటివలే జుద్జ్మెంట్ వెలువరించిన ఈ కేసు వివారాలు లోకి వెళితే,

   ఆమె ఒక ఉద్యోగిని. వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. ఆమె ను పెండ్లి చేసుకుంటాను అని ఆ ప్రేమికుడు ఇచ…

తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!

Image
హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన  తిరుమల  పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు  ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా  ఉన్నాడు అంటే అది  ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు  ఉన్న దేశం లొనే  సాద్యం .

    మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని  తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన  కొంత మంది  మత మార్పిడి  కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి.   సాక్షాత్తు ఏడుకొండల స్వామీ నే రెండు కొండలుకు పరిమితం చేసే తెంపరి తనం అన్య మతస్తులకు కలిగిందంటె అది ఖచ్చితంగా ఆ మహానుబావుని చలవే. హిందూ మత విస్వాసాల మీద నమ్మక్కం లేని వ్యక్తులను ధర్మకర్తలుగా, ఎండోమేంట్ అధికారులుగా నియమించబట్టె ఇటువంటి ఆగడలు ఏడుకొండలు మీద ఏదో ఒక రూపం లో నిత్యం జరుగుతున్నాయి. ఇంత వరకు మత మార్పిడి వ్యవహారాలలో చట్ట విరుద్దంగా ప్రవర్తించిన వారికీ శిక్షలు విదించిన దాఖ్హాలలు లేవ…

స్త్రీల ర్రక్షణలో మోరల్ పోలిసింగ్ చేసే దమ్మున్న వారు ఇండియాలో 2% మాత్రమేనా ? అయితే ఎందుకలా ?

Image
బి ఫర్ చేంజ్ అనే   స్వచ్చంద సంస్త వారికి , మన సమాజంలో స్త్రీల మిద జరుగుతున్నా అత్యాచారాలు ఇతర లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగి పోవడం పట్ల ఒక ఆలోచన కలిగిందట .అసలు మన సమాజం లో ఎంత శాతం ప్రజలు బహిరంగంగా స్త్రీల పైన జరిగే లైంగిక వేదింపులు ని అరికట్టడం లో తమ వంతు బాద్యతను నెరవేరుస్తున్నారు అని. వారు దానిని ప్రయోగాత్మకంగా పరిశిలించాలి అనుకుని కొంతమంది ఔత్సాహిక నటులుతో డిల్లీలో మరియు ముంబాయి నగరాల్లో ని పబ్లిక్ ప్లేస్ లలో ప్రయోగాలు చేసారు . దానికి సంబందించినదే క్రింద ఇవ్వబడిన విడియో .

    ఒకప్పుడు బజార్లో ఆడపిల్లలను ఎవడైనా ఆకతాయిలు వేదిస్తుంటే ,ఎక్కువ శాతం ప్రజలు వెంటనే రియాక్ట్ అయి వారికి బుద్ది  చెప్పే వారు . వారికి అంత దమ్ము ఉండేది . కాని లౌకిక రాజ్యం ఏర్పడ్డాకా ప్రజలలో "లౌక్యపు బుద్దులు " ఏర్పడి 'తప్పించుకు పోవువాడు భారతీయుడు సుమతీ " అని కామ్ గా వెళ్లి పోతున్నారంట . నిజమే మరి ! ఇలా భారతీయులు ఎందుకు అయ్యారు అనేది ఒక సారి ఆలోచిద్దాం
   (1)  లైంగిక దాడికి గురి అవుతున్న స్త్రీలు ఎటువంటి వారో? ఆమె మద్య , ఆ పురుషులు మద్య ఏమి గొడవలు ఉన్నాయో మనకె…

ప్రియుడిని కలువ వద్దన్నందుకు తండ్రిని అతి దారుణంగా చంపడమే కాక ,అతనిని" రేపిస్ట్ " గా చెపుతున్న కూతురు!

Image
ఈ కలి కాలంలో  ఎవరి మాటలు నమ్మాలో , ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావటం లేదు . రంకు నేర్చినోల్లు బొంకు నేర్వక పొతే ఒళ్ళూ ఇల్లూ గుల్లవుతుంది కాబట్టి , రంకు కు బొంకు ఎప్పుడూ హచ్ డాగ్ లాగా ఫాలో కావాల్సిందే .కాబట్టి ఎవరి మాటలు అయినా నమ్మొచ్చు కాని , ఇతరుల వ్యామోహం లో పడి కన్నూ , మిన్నూ కానక ప్రవర్తించే వారి మాటలు నమ్మడం కష్టం . మొన్ని మద్య డిల్లి లో జరిగిన ఒక 56 యేండ్ల వ్యక్తీ మర్డర్ అనేక అనుమానాలను, తండ్రి బిడ్డల మద్య ఉండే సహజ ప్రేమానురాగాలను అనుమానించేలా   చేస్తుంది .

                        అయన 56 యేండ్ల వ్యక్తీ . అతనికి 3 కుమార్తెలు , భార్యా ఉన్నారు . దిల్లిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం . ఇరువురి కుమార్తెలు వివాహం చేసాడు . 3 యేండ్ల క్రితం భార్య చని పోయింది . చిన్న కుమార్తె వయస్సు ప్రస్తుతం 23 సంవత్సరాలు . తండ్రి ఉద్యోగానికి వెళ్ళాక ఆమె ఒక్కతె ఇంట్లో ఉంటుంది . ఆమెకు ప్రిన్స్ సందు అనే వాడితో పరిచయం ఉండడమే కాక అది ప్రేమ గా మారింది . తండ్రి ఇంట్లోనుంచి బయటకు వెళ్ళగానే వారింటికి ప్రిన్స్ రావడం పరి పాటి . ఇది తెలిసిన తండ్రి మందలించాడు . అలా అయన గారి మందలి…

పద్దతులు ఫారెనువి అయినా,బుద్దులు ఇండియావే గదా!

Image
నేను నిన్ననే టి.వి లో ఒక ప్రత్యక్ష ప్రాసరం చూసాను. పాపం ఎవరో ఒక అమ్మాయి బాగ చదువుకున్న దానిలా ఉంది.ఒకటే వెక్కి, వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రేక్షక లోకానికి వివరిస్తుంది.ఏమిటా పాపం ఆ విదంగా ఏడుస్తుంది, ఏమి జరిగి ఉంటుందా అనే కుతుహలంతో అంఏ చెప్పేదానిని, శ్రద్దగా ఆలకించటం జరిగింది. ఇంతకి కథ ఏమిటంటే

  అమే(ఏడ్చే అమ్మాయి), ఆమే గారి బాయ్ ఫ్రండ్ ఒకరినినొకరు ఇస్టపడి, ఆ ఇష్టాని వివాహం వరకు తీసుకెళ్లాలంటే ఒకరినొకరు మరింతగా అంటే బాగా లోతుగా అర్థం చేసుకొవాడానికి ఫారెన్ పద్దతి అయిన డేటింగ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని బావించి ఒక శుభముహుర్తాన ప్రొసీడ్ ఐయి పోయారు.

  ఇక్కడ ఒక విషయం మనం ముచ్చట్టించుకోవాలి. ఏమిటంటే మన సాంప్రాదాయం ప్రకారం వివాహానికి ముందు పెండ్లి చూపులు,తర్వాత నిశ్చయ తంబూలాలు లాంటి కార్యకమలతో ఇరువైపుల పెద్దల అంగీకారంతో పెండ్లి కుదుర్చుకుంటారు.ఆ తరవాత వివాహం చేసుకుని, శొభనం అనే తంతుతో ఆలు మగలుని ఒకటి చేస్తారు. ఇది మన పద్దతి. ఇక ఫారెన్ పద్దతి అయిన డేటింగ్ అంటే పెండ్లికి ముందే అన్ని కానిచ్చేసి, ఆ తర్వాత అణ్ణిట్లో ఒ.కె అనుకుంటే పెండ్లి చేసుకుంటారు. లేదంటే లేద…

ఏడుపు గొట్టు పెండ్లి అంటే తెలుసా? తెలియకపోతే చూడండి !

Image
ఎవరైనా ఏదైనా పనిని తన ఇష్టం లేకుండా చేస్తుంటే " వాడి పద్దతి చూస్తుంటే ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుంది "అని అంటున్టాము . ఆ  ఇష్టం లేని ఏడుపు గొట్టు పెండ్లి అనేది ఎలా ఉంటుందో ఈ క్రింది పెండ్లి విడియోలోని పెండ్లి కొడుకును చూస్తె తెలుస్తుoది. 

                             Link:         https://youtu.be/XWmqMjLpZv8


                              పై వీడియో కర్ణాటక లో జరిగిన ఒక బలవంతపు పెండ్లికి సంబందించింది . మొదటగా చూసిన వారెవరికైనా పెండ్లి కొడుకు ని చూస్తె నవ్వు వస్తుoది . కాని అతని ఏడుపు వెనుక ఉన్న పోలిస్ వారి దాష్టికం గురించి తెలుసుకుంటే బారత దేశంలో బలవంతపు పెండ్లిళ్ళు కు స్త్రీలే కాదు , పురుషులు కూడా ఎలా బలి అవుతున్నారో తెలుసుకొవచ్చు . విదియోలోని అమ్మాయి అబ్బాయి ప్రెమించుకున్నారట . కాని అ అమ్మాయి గురించి అతనికి ఏమి తెలిసిందో ఏమో , ఆ  అబ్బాయి ఊరు వదలి పారిపోయాడట . నాలుగేండ్లు తర్వాత అ ఊరికి వస్తే , అమ్మాయి తరపు వారు పోలిస్ కంప్లైంట్ ఇస్తే , వారు అతన్ని ఊరి యువతకు అప్పచెప్పి ఇద్దరికీ గుళ్ళో పెండ్లి చేసి పారేయండి అని హుకుం జారి చ…

రత్నాల నమ్మకాలను నమ్మని T.V 9 వారికి , రాణుల " శాపాలు " మీద నమ్మకమేనట!

Image
T.V. 9 తెలుగు చానల్ వారు తెలుగు ప్రజలలో ఉన్న మూడ నమ్మకాలను పారద్రోలి వారిని చైతన్యవంతులు చేయాలనే తపనతో ఉన్నట్లు, ప్రతి  పావు గంటకు ఒక సారి వారు   పని కట్టుకుని చేసే స్లోగన్లు తెలియచేస్తుంటాయి . దానికోసం వారు  ప్రజల నమ్మకాల మిద దాడిచేస్తుంటారు . ఉదాహరణకు తెలుగువారిలోనే యావత్ భారతీయులలో పేరుకు తగినది అనో , జాతక చక్రం ప్రకారమో, వజ్రం, కెంపు, పచ్చ లాంటి వాటితో పొదిగిన ఉంగరాలు ధరించే నమ్మక్కం ఉంది . వాటి మీద మన రాష్ట్రంలో కోట్ల బిసినెస్ టర్నోవర్ అవుతుంది . శాస్త్రీయ విజ్ఞానులం అని చెప్పుకునే వారికి అవి అప్త్రాల్ "రంగు రాళ్ళు " కావచ్చేమో కాని , వాటి మిద వ్యాపారం చేసే వారికి మాత్రం అవి ఖచ్చితంగా కోట్లకు పడగలెత్తించె విశ్వాస  నిధులు . ఇక ప్రజలు కూడా వాటిని నమ్మి దరిoచడమే కాక వాటి వలన అంతో ఇంతో మేలు జరుగుతుoడబట్టే  వారిలో నమ్మకం దిన దిన ప్రవర్ధమాన మవుతుంది అనుకుంటున్నాను . ఇదే విషయంలో నా స్వానుభవం కూడా ఉంది . అదేమిటంటే :

       పది యేండ్ల క్రితం అనుకుంటా ఒకాయన నా జాతకం చూసి "మీరు పచ్చపొదిగిన ఉంగరం ధరిస్తే చాలా మేలు జరుగుద్ది అంటే  నేను న…

నాటి చెంగీఝ్ ఖాన్ నుంచి నేటి 'లవ్ జిహాది " ల దాక లక్ష్యం ఒకటే ,"మహిళలను చెరచడం ద్వారా 'మనరాజ్యం ' ఆక్రమించడం" !?

Image
"నిజమైన విశ్వాసం లేకుండా కేవలం పెండ్లి కోసం మార్చుకునే "మత మార్పిడి "కాని ,తద్వారా చేసుకునే మత వివాహం కాని చెల్లు బాటు కావు . ఇది చట్టానికే కాక ,ఖురాన్ లోని నియమ నిబందనలకు కూడా వ్యతిరేకం ". ఇది మొన్న అలహాబాద్ హై కోర్టు వారు 5 జంటల "మత మార్పిడి వివాహాల కేసు " లలో ఇచ్చిన సంచలనాత్మక తీర్పు .. 

 ఈ దేశం లవ్ జిహాది ల పేరిట కొంత మంది, హిందూ స్త్రీలను ప్రేమ పేరుతొ మోసగించి తమ మతం లోకి మారుస్తున్నారు అంటే చాలా మంది అభ్యుదయ వాదులు ,ప్రేమాందులు  పెదవి విరిచారు .ఇదంతా కొన్ని హిందూ సంస్త లు పని గట్టుకుని చేస్తున్న ప్రచారం అని కొట్టి పారేశారు .కాని అలహా బాద్  హై కోర్టు వారి తీర్పుతో ,ఈ దేశం లో 'ఆపరేషన్ లవ్ జిహాద్ ' నడుస్తుంది అన్నది తేటతెల్లమయింది . 

    5 గురు జంటలు ప్రేమ వివాహం చేసుకున్నారు .ప్రేమించి పెండ్లి చేసుకున్నమొగుళ్ళు ,తమ భార్యలని తమ మతం లోకి మార్చి మరీ పెండ్లి చేసుకున్నారు . తమ ఆడ పిల్లల్ని ప్రేమ పేరుతో వంచించి వివాహం చేసుకోవడమే కాకుండా ,వారిని తమ కుటుంబానికే కాకుండా ,తమ మతానికే దూరం చేస్తున్నప్పుడు ,తల్లి తండ్రులకు కోపం రావడం సహజం. మరి అటువంటి తల్లి …

పవన్ కళ్యాన్ లోని "కామన్ మాన్ " ఎందుకు ముడుచుకు పోయాడు? కేజ్రీవాల్ లోని "అమ్ ఆద్మీ " ఎలా ముందుకొచ్చాడు!?

Image
కామన్ మాన్! అమ్ ఆద్మీ !. రెండు పదాలు అర్దం ఒకటే. కానీ అవే పదాలు ఒక చోట ప్రజలలో బ్రహ్మాండమైన చైత్యన్యం తెచ్చి ప్రభుత్వాన్ని మార్చివేస్తే, మన దగ్గర మాత్రం ఏమి చెయ్యలేక ముడుచుకుని పోయింది. కారణం, అక్కడ ఎమోషన్ కి ఆలోచన జతకలిసింది, ఇక్కడ ఉన్న ఎమోషన్ ని 'పెద్దరికం" గొంతు నులిమేసింది. అందుకే అది గత ఆరేళ్ళుగా గొంతు దాటి బయటకు రాలేక పోతుంది.

    ఇటీవల డిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ స్తాపించిన ఆం ఆద్మీ పార్టీ 28 సీట్లు సంపాదించి, అధికార కాంగ్రెస్ ని ఊహించని చావు దెబ్బ తీసింది. కొంచం లౌక్యం ప్రదర్శిస్తే కేజ్రీవాలే డిల్లీకి ముఖ్యమంత్రి అవుతారు. మరి సంవత్సర కాలం క్రితం  వరకు ఉనికిలో లేని అమ్ ఆద్మీ పార్టి ఒక్క సారిగా ఎన్నికలలో ఘన విజయాన్ని ఎలా సాదించగలిగింది? ఒకటే కారణం , గత ప్రబుత్వ విదానాల మీద విసిగి వేసారి ఉన్న ప్రజలు , అవినీతి మీద సమర శంఖం పూరించిన "అన్నాహాజారే " లాంటి సామాజిక ఉద్యమ కారుడు వెనుక నడవడానికి సిద్ద పడినపుడు ,కేజ్రీవాల్ తెలివిగా వారి ఎమోషనల్ పీలింగ్స్ ని "ఆంఆద్మీ " పార్టీ స్తాపించడం ద్వారా దాని వైపు ఆకర్షించించి వి…

ఇష్టపడినంత కాలం "ఇష్ట సఖుడు" అయినవాడు ,మొహం మొత్తగానే "రేపిస్ట్ " అవుతాడా !?

Image
ఇది నేనంటున్న మాట కాదు  సాక్షాత్తు మన దేశ అత్యున్నత  న్యాయ స్తానం వారు ఒక కేసు విచారణ సందర్బంగా చేసిన వ్యాఖ్య ఇది . ప్రస్తుతo కోర్టుల్లో నడుస్తున్న అదిక బాగం రేప్ కేసుల తీరు తెన్నులు చూసి విసిగి పోయిన న్యాయ మూర్తుల నుండి అలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్య మేమి కాదు . ఇదే కేసుకు సంబందించి గతం లో బాంబే హాయ్ కోర్టు వారు క్రింది విదంగా అభిప్రాయ పడ్డారు ..
" Many  of the cases are being reported by those women who have consensual physical relationship with a man but when the relationship breaks due to one reason or the other, the women use the law as a weapon for vengeance and personal vendetta to extort money and sometimes even to force the boy to get married to her."

  అంటే కొంత మంది స్త్రీలు అన్నీ తెలిసీ కూడా తమకు ఇష్టం వచ్చినంత కాలం తమకు నచ్చిన వ్యక్తితో శారిరక సంబందం పెట్టుకుని ఏదైనా కారణాల   వలన వారి మద్య సంబందం చెడిపోతే , స్త్రీ చట్టాన్ని ఆయుధంగా చేసి పురుషుని మీద తమ పగ , ప్రతీకారాలు   తీర్చుకోవడం , డబ్బులు గుంజడం , చివరకు బలవంతపు పెండ్లికి ఒప్పించడం జరుగుతుంది అని అన్నా…

మని"'she" లో "అందం" అనేది ఎక్కడుంటుంది?

Image
ఈ ప్రశ్న నాలో ఉదయించడానికి కారణం ఈ రోజు విశాఖ  లో "ఫ్యాషన్ వీక్" పేరుతో ప్రారంభం కానున్న అతివల "అందాల ప్రదర్శన" జరుగుతుండడం, దానిని మన మహిళా సంఘాల వారు ముక్త కంటం తో నిరసిస్తుంటే, వారిని కర్తవ్య పరాయణులైన మహీళా పోలిసులు ఈడ్చివెయ్యడం, అరెస్టులు చెయ్యడం , ఇదంతా చూసిన నాకు పై సందేహం కలగడం చక చకా జరిగిపోయాయి.

  అసలు అందాల పోటిలు ఎందుకు ఆడవారికే నిర్వహిస్తారు? మగవారికి అందం ఉండదా? ఇది కూడ నాకు కలిగే డౌటుల్లో ఒకటి! బహూశా  మగవారిలా చొంగ కార్చుకుంటూ చూసే బుద్ది ఆడవాళ్లకి లేకపోవడం వల్లా "అందాల పురుషుల" పోటిలు కి ఎక్కువుగా ఆదరణ ఉండదేమో? కాకపోతే "కండల వీరుల్ని" చూపించే "మిస్టర్" పోటిలు ఉంటాయి.ఎడ్ల పందాలు, బుల్ ఫైట్ లాగా ఇటువంటివి కొంత మందికి వినోదం కలిగించ వచ్చు!                           ఇక పోతే అసలు విషయం "మనిషిలొ అందం " ఎక్కడుంటుంది. నా ఉద్దేశ్యం లో ప్రతి వ్యక్తిలో ఏదొ రకమైనా అందం ఉంటుంది. అందం ఒక్క ప్రదాన లక్షణం ప్రత్యేక ఆకర్షణ కలిగించేది.ఉదాహరణకి కొంత మందికి నవ్వు అందం. మరికొంతమందికి మాటలో అందం ఉంటుంద…

రామాయణ కాలం లో స్త్రీ కి దొరికిన రక్షణ, ఆధునిక కాలం లో ఉందా?

Image