ఇష్టపడినంత కాలం "ఇష్ట సఖుడు" అయినవాడు ,మొహం మొత్తగానే "రేపిస్ట్ " అవుతాడా !?
Mumbai High Court |
ఇది నేనంటున్న మాట కాదు సాక్షాత్తు మన దేశ అత్యున్నత న్యాయ స్తానం వారు ఒక కేసు విచారణ సందర్బంగా చేసిన వ్యాఖ్య ఇది . ప్రస్తుతo కోర్టుల్లో నడుస్తున్న అదిక బాగం రేప్ కేసుల తీరు తెన్నులు చూసి విసిగి పోయిన న్యాయ మూర్తుల నుండి అలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్య మేమి కాదు . ఇదే కేసుకు సంబందించి గతం లో బాంబే హాయ్ కోర్టు వారు క్రింది విదంగా అభిప్రాయ పడ్డారు ..
" Many of the cases are being reported by those women who have consensual physical relationship with a man but when the relationship breaks due to one reason or the other, the women use the law as a weapon for vengeance and personal vendetta to extort money and sometimes even to force the boy to get married to her."
అంటే కొంత మంది స్త్రీలు అన్నీ తెలిసీ కూడా తమకు ఇష్టం వచ్చినంత కాలం తమకు నచ్చిన వ్యక్తితో శారిరక సంబందం పెట్టుకుని ఏదైనా కారణాల వలన వారి మద్య సంబందం చెడిపోతే , స్త్రీ చట్టాన్ని ఆయుధంగా చేసి పురుషుని మీద తమ పగ , ప్రతీకారాలు తీర్చుకోవడం , డబ్బులు గుంజడం , చివరకు బలవంతపు పెండ్లికి ఒప్పించడం జరుగుతుంది అని అన్నారు . ఇది చాలా చేదు వాస్తవం. సమాజంలొ స్త్రీల పట్ల ఉన్న సానుభూతిని , అబలల రక్షణ కోసం పటీష్టం గా తయారు చేసిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ కొంత మంది స్త్రీలు పెడుతున్న ఇటువంటి తప్పుడు కేసులు వలన చివరకు స్త్రీల అభియొగాలను సమాజం అనుమానించాల్సి వస్తుంది .
ఇక కేసు వివరాలు లోకి వెళితే, బాంక్ లో ఉన్నత్యోదిగి అయిన ఒకాయనకి బార్యా ఇద్దరు పిల్లలు . అయితె అతనికి మాజి ఏయిర్ లైన్స్ ఉద్యొగినితొ స్నేహం ఏర్పడి అది కాస్త ప్రణయంగా మారింది. కోంత కాలం కలిసి విహరించారు . ఆ తర్వాత ఏందుకో వారి మద్య అభిప్రాయ బేదాలు వచ్చి, ఆమె అతగాడి మీద రేప్ కేసు పెట్టింది . తనకు వివాహం అయిన విషయమ్ దాచి, తనను పెంద్లి చేసుకుంటాను అని మబ్యపరచి లొంగ దీసుకున్నాడు అని ఆమె అభియోగం . తనకు పేంద్లి అయిందని ఆమెకు తెలిసే తాము సన్నిహితంగా ఉన్నామని, తనను బ్లాక్మెయిల్ చెయ్యడనికే తప్పుడు కేసు పెట్టిందని అతగాడి వాదన . క్రింది కోర్తుల్లో, బాంబే హై కోర్టు అతని వాదనను సమర్దించి కేసును కొట్టి వేయగా, విషయమ్ సుప్రీం కోర్టుకు వచ్చింది . సుప్రీం కోర్టు వారు పై విదంగా వ్యాఖ్యానించిoదే తప్పా ఈ కేసులో ఇంకా ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు .విచారణ కొనసాగుతుంది
ఒక న్యాయవాదిగా నాకున్న అనుభవమ్ మేరకు స్రీల రక్షణ విషయమ్ లో చట్టాల అమలుకు భారతీయ కోర్టులు చిత్త శుద్దితో ఉన్నాయని చెప్ప గలను. ఏ మాత్రమ్ సాక్ష్యం అనుకూలంగ ఉందనిపించినా నిందితులను వలిపెట్టిన దాఖాలాలు స్వల్పాతి స్వల్పమ్.అలా అని చెప్పి తప్పుడు సాక్ష్యాలను పరిగణన లోకి తీసుకుని అమాయకులను శిక్షిస్తె అది సమాజo లో తప్పుడు మేసేజ్ లు ఇస్తుంది . అలా జరుగకుండా చూడాల్సిన బాద్యత కూడ న్యాయస్తానాల పై ఉంది కాబట్టె సుప్రీం కోర్టు వారు , బాంబే హై కోర్టు వారు పై విదంగా స్పందించి ఉంటారు అని బావించాల్సి వస్తుంది.
"సత్యమేవ జయతె " అని అదికార నినాదం కలిగిన భారత దేశం లో తప్పుడు కేసులు పేట్టె వారిని ఉరి తీసే విదంగా చట్ట సవరణ చేసినా సమంజసమే అని నా అభిప్రాయం !
(30/6/2014 post Republished)
yes sir..
ReplyDelete