కొడుకులకు కోట్లు ఇచ్చినా రాని "పుణ్యఫలితం" దేనితో వస్తుందో తెలుసా?


                                                                     


                                  నిన్న నేను ఒక వార్త చదివాను. బార్యా భర్తలు,కాపురం చేసి, ముగ్గురు కోడుకుల్ని కన్నారు. చక్కగా చదివించి, వారిని పెంచి,ప్రయోజకుల్ని చేసారు. తమ కున్న బూమిని ముగ్గురికి సమానం గా పంచారు. తమ జీవనార్దం మూడు ఎకరాలు ఉంచుకున్నారు. వారు వయో వ్రుద్దులయ్యారు.

   వారి బూమి ప్రక్కనుంచే బై పాస్ రోడ్డు పోవటం పోవటం వలన మూడు ఎకరాలకు అదిక దరలు పల్కి కోట్ల రూపాయలకు అమ్మి వేశారు. ఆ సొమ్మంతా ఏమి చేసుకుంటారు మీరని చెప్పేసి, కొడుకులే వాటిని కూడ పంచుకుని, పది లక్షలు రూపాయలు ముసలి వారికి ఇచ్చారట. ఆ తర్వాత ఒక రోజు వారిని చూసే బాద్యత చిన్న కుమార్డు తీసుకుని వారి దగ్గర ఉన్న ఆ పది లక్షల రూపాయలు అతనే తీసుకున్నాడట. చిన్న కోడలి సంరక్షణలో నాలుగు నెలలు హాయిగా గడిచి పోయాక, ఇక తాను చూడను అని, ఇతర కొడుకులకు కూడా కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారు కాబట్టి వారు కూడ చూడాలని చెప్పి నిష్కర్షగా బయటకు వెల్ల గొడితే, వారు తతిమ్మా కొడుకులని అడిగితే తమకు సంబందం లేదన్నారట. పాపం ఆముసలి దంపతులు పోలిశ్ స్టేషన్ కి వెళ్ళి తమకు న్యాయం చెయ్య మని బోరు మంటే ,పోలిస్లు ఆ "పెద్ద మనుషులను" ఏ మనాలో అర్థం గాక ఆలోచిస్తున్నారట. కథ పేపర్లోకి వచ్చింది.

  ఇక్కడ మనకు అర్థం అయ్యేది ఒకటే కొడుకు మనోడయినా కోడలు మనది కావాలన్న రూలేమి లేదు. కాబట్టి సాద్యమయినంతవరకు  ముసలి వాల్ళకు ఆస్తులు పంపకాలలో వచ్చిన బాగాన్ని తాము జీవించి ఉన్నంత వరకు ఎవరకు ఇవ్వ కుండటమే మంచిది. మైనర్  ఆస్తులు వలేనే వారి ఆస్తులు "కోర్ట్" ల అనుమతితో తప్ప, ఇతరత్ర అన్యాక్రాంతం అవకుండా తగిన చట్ట సవరణలు చేస్తే మంచిది.

  హిందువులకు "సప్త సంతానం" అనే విదానం ఉంది . దాని ప్రకారం ’సహజ సంతానం" అయిన పిల్లలు ఒక రకం మాత్రమే. సత్రము కట్టించడం, చెర్వులు తవ్వించడం, దేవాలయ నిర్మాణాలు, కవితలు రాయడం(కవితా కన్యక),విద్యాలయాలు కట్టించడం మొదలయినవి అన్నీ "సంతానం" లో బాగమే.  అంటే  పదిమందికి ఉపయోగపడుతూ, చిరకాలం ఉండి, శాశ్వత కీర్తీ తెచ్చేవి ఏవయినా "సంతానం" గా హిందూ దర్మం చెప్పింది. కాని  పిల్లల మీద ఉండే "సహజ ప్రేమ" మన కళ్లన్ను కప్పేసి, అందులను చేస్తుంది.

  పయిన చెప్పిన కథ లోని వ్రుద్ద దంపతులు కోడుకులకు తమ వాటా దనం ఇవ్వకుండా  ఒక "వ్రుద్దాశ్రామాన్ని" ఏర్పాటు చేసి ఉంటే అది వారినే కాదు వారి లాంటి దురద్రుష్ట వంతులు ఎంతో మంది వ్రుద్దులకు ఆలంభన మయ్యేది కథా. మన పెద్దలు  వారి అనుభవ సారాన్ని రంగరించి ఏర్పర్చిన "దర్మ సూక్ష్మములు" మనం గ్రహించి పాటిస్తే అదే మన సమాజానికి శ్రీ రామ రక్ష."దర్మో రక్షతి రక్షితః"  
                                                                (12/12/2012 Post Republished).

Comments

 1. వింతగా ఉందే కొడుకులకు కోట్లు పంచితే పుణ్యం వస్తుందా ?ఏ ధర్మసస్త్రంలో ఉంది ఈ మాట మనువు గారూ..

  ReplyDelete
  Replies
  1. వస్తుందని నేనెక్కడ అన్నాను? పూర్తి టపా చదవి అభిప్రాయం తెలుపవలసినదిగా మనవి.

   Delete
 2. నిజానికి మనం ఆ Ring Road రాకుండా చేసి ఉండాలి ఎందుకంటే అది రావడం వలన భూములు ఇళ్ళ స్థలాలగా మారి తినడానికి అన్నం దొరకని స్థితికి తీసుకు వస్తున్నాయి.

  ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )