తండ్రి తిట్టాడు అని ప్రియుడిని పెళ్ళాడిన ఆ "టెన్నిస్ ప్లేయర్ "పరిస్తితి , 5 నెలలుకే ఎందుకు "భువన పరాజయం" అయింది !!?

                                                                           

                           
                                  పెండ్లికి ఈడు మాత్రమే ముఖ్యం కాదు, మంచి చెడులను బేరిజు వేసుకోగల "మానసిక పరిపక్వత " కూడా ముక్యం అని రుజువు చేసే కేసుల జాబితాలో  మరొక కేసు చేరింది. మొన్నటి శ్రీజ నుండి నేటి "భువన " వరకు ఎంతో మంది అమ్మాయిలూ మోహావేశమ్ లో ముందు వెనుకలు కానకుండా , తమ బవిష్యత్ గురించి తల్లితండ్రులు , ఇతర పెద్దలు చెప్పే మాటలు వినకుండా , వేడిలో నిర్ణయాలు తీసుకుని , గొంతు వరకు ఉబిలో ఇరుక్కు పోయాక , చివరకు "చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా" , తల్లితండ్రుల వద్దకు వచ్చి బావురు మంటుంటె , తల్లి తండ్రుల గుండెలు చెరువులవుతున్నాయి.

           ఆమె పదేళ్ళ అనుభవం ఉన్న టెన్నిస్ ప్లేయర్. రోజూ జిమ్ కి వెళుతూ అక్కడ పరిచయం అయిన వ్యక్తితో చనువు పెంచుకుని అది కాస్తా ప్రేమగా మార్చుకుంది. ఏదో ఒక టోర్నమెంట్లో  ఓడిపోయిందట . అది తెలిసిన ఆమె తండ్రి గారు కూతురు ఇంటికి వచ్చే దాక కూడా ఆగకుండా , పోన్ లోనే చెడా మడా తిట్టాడట. అలా చెయ్యడం ఆమె కెరీర్ డెవలప్మెంట్ కోసమే అయినా ఆమెకు మాత్రం ఎంతో నామోషి అనిపించింది అట. వెంట నే పోన్ లో ప్రియుడికి , తన తండ్రి తిట్టిన విషయం  పూస గుచ్చినట్లు చెప్పిందట. దానితో చలించిపోయిన ప్రియుడు , "ఇక మీ  ఇంటికి వెళ్ళ  వద్దు, నా దగ్గరకు వచ్చేయి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను " అని అనేసరికి , ఇక ఈ టెన్నిస్ ప్లేయర్ కి ఒక్క సారిగా ప్రియుడి మీద ప్రేమ ఉప్పొంగి పోయి ఎప్పెడెప్పుడు ప్రియుడి ఎద మీద వాలి పోదామా అనిపించి , టొర్నమెంట్ నుంది తిరుగు ప్రయాణం లో హైదరాబాద్ లో విమానం  దిగగానే , ఇంటికి వెళ్ళకుండా నేరుగా ప్రియుడి ఇంటికే వెళ్ళిపోయింది అట.

          ఆ తర్వాత తల్లి తండ్రులను కాదని అతనితోనే ఉండిపోవడం, అతన్ని పెండ్లి చేసుకుని జామ్ జామ్ అని ఒక 20 రోజులు "హనిమూన్ " ఎంజాయ్ చేసారు అట. వీరిద్దరి పరిచయం అయింది పోయిన డెసెంబర్ లో. వీరిద్దరి పెండ్లి జరిగింది 2015 అంటె ఈ  సంవత్సరం మే లో. పెండ్లి అయిన  20 రోజుల నుండి  ప్రియుడి నిజ స్వరూపం బయటపడడం ప్రారం బం అయిందట. అతనికి అంతకు ముందె ఒక పెండ్లి అయిందట. ఈ టెన్నిస్ భార్యని కాలేజికి పంపేవాడు కాదట. ఇంట్లో ఉంచి, బయట తాళం వేసుకుని వెల్లే వాడట . ఆమె తల్లి తండ్రులను కలవనివ్వడం లేదట. ఇలా అనేక చిత్రహింసలు పొందిన ఆమె చివరకు ఎలాగో తండ్రికి విషయం చేరవేస్తే , ఆయనగారు తెలంగాణా మంత్రి గారి కొడుకు సహాయం తో ఆ అమ్మాయి ని తన ఇంటికి తీసుకు వచ్చి, ఆమె భర్తకి మంత్రి గారి కొడుకు చేత వార్నింగ్ లు గట్రా ఇప్పించారు అట. దానితో అల్లుడు మంత్రి గారి కొడుకు మీద కేసు పెడితే , మంత్రి గారు కలుగచేసుకుని, ఆ అమ్మాయిని, ఆమె తండ్రి ని పిలిపించి విలేకరుల సమావేశం పెట్టి సంజాయిషి ఇచ్చుకునే పరిస్తితి. దానితో పోలిసులు ఎలర్ట్ అయి అమ్మాయి భర్త మీద గృహ హింస కేసు పెట్టి విచారణ చేస్తున్నారు . అదీ కద .

        కొంతమంది ఆడపిల్లలు పెండ్లి వయస్సు వచ్చే సరికి, తమ బాగు కోరి చెప్పే పెద్దలు మాటలు కర్ణకటొరంగ అనిపిస్తాయి. అలాంటి సమయం నే కొంతమంది అవకాశవాదులు  చక్కగా ఉపయోగించుకుని , వాళ్ళని ట్రాప్ చేసి చివరకు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తల్లితండ్ర్లు ఎంత అనుభవం ఉన్నవారైనా , విజ్ఞాన వంతులు అయినా , చెప్పిన మాట వినని పిల్లలు ఉన్నప్పుడు వారు చెయ్యగలిగింది ఏమి లేకుండా పోతుంది. ముక్యంగా 18 యేండ్ల నిబందన వలన చట్టపరంగా తల్లి తండ్రులు ఏమి చేయలేని నిస్సహాయులు అవుతున్నారు.  , చివరకు పిల్లలు పులి నోట్లో చిక్కిన లేడి పిల్లలా విలవిలలాడుతుంటే , కల్పించుకుని వారికి రక్షణ ఇస్తుంది పుట్టిటింటి వారే.

                   తమ పిల్ల జీవితాలు బలి అవుతున్న వేళ ,తల్లి తండ్రులను నిస్సహాయులుగా మారుస్తున్న హిందూ వివాహ చట్టం లోని నిబందనలు మార్చాలిన అవసరం ఉంది.వివాహ  వయో నిబందనను  18 ఏండ్ల నుంచి 25 సంవత్సరాలకు పెంచాలి . 18 యేండ్ల నుండి 25 సంవత్సారాల లోపు వారు పెండ్లి చేసుకోవాలి అంటె తల్లి తండ్రుల లేక గార్డియన్, లేదా కోర్టు అనుమతి పొందేలా చట్ట సవరణ చేస్తే , చాలా వరకు మోహావేశపు వివాహాలు, మానసిక పరిణతి పొందని వారి మద్య   వివాహాలను నిరోదించడమే కాక , ఎంతో మంది ఆడపిల్లలు మరియు తల్లి తండ్రుల కన్నీళ్ళు తుడిచిన  వారమవుతాం.

                                     మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను క్లిక్ చేయండి.

               

                         

                                             (3/11/2015 Post Republished).

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం