సిమాంద్రా లో "లోటస్ పాండ్ " ని "లోటస్ దళం " అక్రమిస్తుందా ?
బుద్ది భూములేలదాం అంటుంటే ,రాత గాడుడులు కాద్దాం ! అంటుందట ! పాపం ,అలాగే ఉంది సిమాంద్రా లోని ప్రతిపక్ష పార్టి వారి పరిస్తితి. నిజానికి తెలంగాణాలో ఆ పార్టికి అనుకూల పరిస్తితులు లేకపోయినా ,సిమాంద్రా లో మాత్రం అధికార పగ్గాలు పట్టగల అవకాశాలు మెండుగా ఉండేవి . కాని మోడీ గారి చరిష్మా ఒక ప్రక్క , జండా పై కపి రాజులా పవన్ కళ్యాణ్ గారి ప్రబంజనం మరొక పక్క చంద్ర బాబు గారికి తోడ్పడడం తో ఎన్నికల్లో ప్రతిపక్ష స్తానం తో సరి పెట్టుకోక తప్పని పరిస్తితి శ్రీ జగన్ గారికి . పాపం ఆయన్ని మొదట్నుంచీ ఎదో అద్రుశ్య శక్తి అధికారం పొందకుండా అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన తండ్రి తదనంతరం ఆయనకే రావాల్సిన అవకాశం రాలేదు . ఆ తర్వాత అయన గారి తొందరపాటు తనం కాంగ్రెస్ కి దూరం చేసినా ,సామాన్య ప్...