ముఖ్యమంత్రి గారి దెబ్బతో నోళ్లు తెరిచిన నాయకులు!
సమైఖ్యాంద్ర కోసం సీమాంద్రా వారు ఉద్యమం మొదలుపెట్టి మొన్నట్టికి తొమ్మిది రోజులు అయింది. సరే ఆ ఉద్యమాన్ని తెలంగాణా నాయకులు పెట్టుబడి దారుల కల్పిత ఉద్యమంగా అభివర్ణించినా, కల్పిత ఉద్యమాలు అంత సీరియస్ గా ఉంటాయనుకోవటం సత్య దూరమే అవుతుంది . ఇక ఎక్కడ తెలంగాణా లో తమ పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందో అని గత్యంతరం లేని అంగీకారాలు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల హెడ్ లు పైకి మౌనంగా ఉన్నా, తమ సీమాంద్ర కాడర్ రంగంలోకి దిగి కేంద్ర ప్రబుత్వ ప్రకటనను ఖండిచటమే కాక,తాము సమైఖ్యాంద్రనే కోరుకుంటున్నామని చెపుతుంటే మౌన అంగీకారం తెల్పారు, తప్పా బయటకు వచ్చి ఒక స్పష్టమైన విదానం,తమ మనసులో ఉన్నది వెల్ల గ్రక్కలేకపోతున్నారు. మనసులో...