ముఖ్యమంత్రి గారి దెబ్బతో నోళ్లు తెరిచిన నాయకులు!

                                                                


 సమైఖ్యాంద్ర కోసం సీమాంద్రా వారు ఉద్యమం మొదలుపెట్టి మొన్నట్టికి తొమ్మిది రోజులు అయింది. సరే ఆ ఉద్యమాన్ని తెలంగాణా నాయకులు పెట్టుబడి దారుల కల్పిత ఉద్యమంగా అభివర్ణించినా, కల్పిత ఉద్యమాలు అంత సీరియస్ గా ఉంటాయనుకోవటం సత్య దూరమే అవుతుంది . ఇక ఎక్కడ తెలంగాణా లో తమ పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందో అని గత్యంతరం లేని  అంగీకారాలు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల హెడ్ లు పైకి మౌనంగా ఉన్నా, తమ సీమాంద్ర కాడర్ రంగంలోకి దిగి కేంద్ర ప్రబుత్వ ప్రకటనను ఖండిచటమే కాక,తాము సమైఖ్యాంద్రనే కోరుకుంటున్నామని చెపుతుంటే మౌన అంగీకారం తెల్పారు, తప్పా బయటకు వచ్చి ఒక స్పష్టమైన విదానం,తమ మనసులో ఉన్నది వెల్ల గ్రక్కలేకపోతున్నారు. మనసులో సమైక్యత పట్ల మక్కువ ఉన్నా, మాట తప్పమని,మడమ తిప్పమని,బింకాలు పోతూ యమ ఇబ్బందిగా పీలవుతున్నారు. వీరందరి మొహమాటాల ముఖం మీద చెళ్ళు మని కొట్టినట్లయింది, మొన్న ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్.

  నల్లారి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించిన తొలినాళ్లల్లో ఆయన గారు సోనియా గాందీ గారి పట్ల చూపే అత్యంత వినవిదేయతలు టి.వీ. లలో చూసిన జనం మరొక లాయల్ సి.యమ్. రాష్ట్రానికి వచ్చాడు అనుకున్నారు. మొదట్లో తెలుగు బాష మాట్లాడానికి ఆయన లోని కాన్వెంట్ చదువుల మనిషి తెగ ఇబ్బంది పడటం చూసి,ఆయన పాలనలో  తెలుగోడికి ఇబ్బందులు ఖాయం అనుకున్నారు. కాని నొప్పించక, తానొవ్వక అనే రీతిలో ఒక్కొక్క పదకం ప్రవేశ పెడుతూ, అందరి విమర్శలకు దీటుగా జవాబు చెపుతూ ఆయన పాలించిన తీరు సమర్దవంతమయిందే
అని కొంతమంది విమర్శకులు సైతం కితాబులిచ్చారు.

  రాష్ట్ర విబజన గురించి కాంగ్రెస్ పార్టీ వారు అడిగిన దానికి "సమైఖ్యాంద్ర" కు మద్దతుగా ఆయన పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. కాని ఆల్రెడి అప్పాట్టికే ఒక అభిప్రాయంలో ఉన్నా అధిష్టాన దేవతకు ఆయన చెప్పిందంతా రొటిన్ సోది లాగా అనిపించి ఉంటుంది. అందుకే "ఒక్క రోజులో,ఒక్క వాఖ్యం" తో విభజన  ప్రకటన తంతుని మమ అనిపించారు.సాదారణంగా విడాకులు తీర్పు ప్రకటించే ముందు న్యాయమూర్తి,పిల్లల పెంపకం,ఆస్తుల పంపకం మీద ఒక అవగాహనకు వచ్చాకే తీర్పును ప్రకటిస్తారు. కాని ఇక్కడ విడాకులు ఇస్తున్నాం. ఇక మీ బాదలు ఏమిటొ చెప్పుకోండి అంటుంటే, అప్పటి దాక అమ్మా, అమ్మా అన్న వారు ముఖాలు వేలాడేసుకుని ప్రజల దగ్గరకు వచ్చి బోరుమన్నారు. ఆ దెబ్బతో సీమాంద్ర  ప్రజలకు చిరెత్తుకొచ్చి ఒక్క పెట్టున వీదుల్లోకి కొచ్చి శాపనార్దాలు పెడుతుంటె అన్ని పార్టిల వారు గమ్మునున్నారు. చివరకు తొమ్మిది రోజుల తర్వాత ఆంద్రప్రదేశ్  ముఖ్య మంత్రి నోరు విప్పారు.

  ఆయన తన మాటల్లో ఎక్కడా అధీష్టాన నిర్ణయాన్ని తప్పు బట్టినట్లు లేక పోయినా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఎంత ఆలోచనా రహితంగా ప్రకటించారో వెల్లడిమ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాదనకపోయినా సగానికి పైగా ఉన్న విద్యుత్ లోటును కొత్త రాష్ట్రం పరిష్కరించడానికి ఉండే సాదక బాదకాలు మాత్రమే కాక, సాగునీరు పంపకాలు, ఉద్యోగ విషయాలలో తెలంగాణా వారి అపోహలు ఇత్యాది సకల సమస్యలను నిర్మొహమటంగ,కుండ బద్దలుకొట్టిణత్లు చెప్పి, వీటికి కేంద్రం చూపించే పరిష్కారాలు ఎమిటి అని ప్రశ్నించారు. ఆయన తన గంట సేపు వివరణ ఆద్యంతం చక్కని తెలుగులో అందరి మనసులో నాటుకునేటట్లు సాగింది. 'ఎక్కడైనా" అమ్మ" గాని, విడగొట్టెటప్పుడు అమ్మ ఏంటి' అని, అమ్మ తో అవసరమైతే తాడో పేడొ అన్నట్లు సాగింది ఆయన ప్రెస్ మీట్.శబాష్ ! ఒక తెలుగు వాడిగా ఆయన ప్రశ్నించే విదానాన్ని మెచ్చుకోవలసిందే. అఫ్కోర్స్ చేతికందిన ముద్ద నోటి కందదేమో అని బావిస్తున్న తెలంగాణా సోదరులకు ఆయన మాటలు కోపం కలిగించడం సహజం. కాని ఆయన లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం సూచించకుండా ఒక వేళా కేంద్రం సీమాంద్రులను కాదని తెలంగాణా అనే ముద్ద నోటికందించినా దాని నిండా  రాళ్ళే  ఉండి చివరకు కడుపు నొప్పికి కారణమవుతయి.ఇప్పుడు నల్లారి వారి తెగువ ను చూసి అచ్చెరువొందిన కాంగ్రెస్ ,తెలుగు దేశం వారు,సమైఖ్యాంద్రకు అనుకూలంగా  తమ నోళ్లు విప్పడం మొదలుపెట్టారు. అందులో బాగమే చంద్రబాబు గారు ప్రదానికి రాసిన లేఖ మారియు కావూరి వారి మీడియా ప్రకటన.

  కేంద్రానికి నిజంగా చిత్త శుద్ది ఉంటే ముఖ్యమంత్రి గారు లేవనెత్టిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపి అటూ సీమాంద్ర ప్రజల, ఇటు తెలంగాణా ప్రజల మద్య వైష్యమాలు లేకూండా చూడాలి. అలా కాకుండా పార్తీ ప్రయోజనాల కోసం చిచ్చు పెట్టాలని చూస్తే రెండు ప్రాంతాలలోను కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోవడం ఖాయం.          

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )