విచారణ కు కలత చెంది ప్రాణ త్యాగం చేస్తామనడం" ఆస్రాం బాపు" గారికి తగని మాట!.

                                                                     

  ఈ దేశం లో ఆశ్రమాదిపతుల మీడ, హిందూ అద్యాత్మిక వాదుల మీద తప్పుడు కేసులు పెట్టడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అసలు కేసులు పెట్టబడి,విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న వారు కూడా నిజమైన నేరస్తులు కారని, తప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ దేశం లో సర్వ సాదార్ణమని, ఈ విషయం లో సుప్రీం కోర్టు వారికి కూడా ఏమి తెలియదని భారత రాజకీయ పక్షాలు తేల్చేసాయి.దీని కోసం ఇటీవలి సుప్రీం కోర్టు వారి తీర్పు అదే, జైల్లో ఉన్న రాజకీయ నాయకులను చట్ట సభలకు పోటి చేయ్యడానికి అనర్హులని ఇచ్చిన తీర్పును అధిగమించాడానికి చట్ట సవరణలకు ఏక కంఠం తో అంగీకారం తెలిపారు అంటే ఈ దేశం లో పోలిసులు పెట్టే కేసులు మీద వారికెంత నమ్మకం ఉందో చెప్పకనే చెపుతుంది. మరి అటువంటీ తప్పుడు కేసులు పెట్టె సంస్క్రుతి ఉన్న దేశం లో హిందూ ఆద్యాత్మిక వాదులు అంటే ఒంటి కాలి మీద లేచే రాజకీయ నాయకులు ఉన్న దేశంలో హిందూ అద్యాత్మిక గురువులను అప్రతిష్ట  పాలు చెయ్యడానికి తప్పుడు కేసులను ఆయుదంగా ఉపయోగించరని గ్యారంటీ ఏమి లేదు. ఇదే అనుమానం ఈ మద్య పదహారేళ్ళ అమ్మాయి విషయం లో లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆద్యాత్మిక గురువు "ఆస్రాం బాపు" కేసులో కూడా కలుగుతుంది.

 ఆస్రాం బాపు అహ్మదాబాద్ కి చెందిన డెబ్బై నాలుగేళ్ళ అద్యాత్మిక గురువు.ఈయన గారికి దేశం లో వివిద ప్రాంతాలలో 400 పైగా ఆశ్రమాలు ఉన్నాయి.లక్షల కొద్దీ భక్తులు,అనుచరులూ ఉన్నారూ . మొన్న డిల్లీ నిర్భయ కేసులో కొన్ని వ్యాఖ్యానాలు అంటే" లైంగిక దాడి సమయాలలో బాదిత స్త్రీలు నేరస్తులను తిట్టి రెచ్చగొట్టే బదులు, "అన్నా"  అని బ్రతి మాలే దోరణీ  అవలంబిస్తే వదిలే వారే కదా," అని అన్నరట. దీని మీద దేశ వ్యాప్తంగా స్త్రీ వాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు ఆయన. ఆయన ఏ ఉద్దేస్యంతో ఆ మాటలు అన్నాడో తెలియదు కానీ, ప్రాక్టీకల్ గా ఆలోచిస్తే బాదిత స్త్రీలు రేప్ సమయాలలో తిట్టడ్డం లాంటి చర్యలు కన్నా "అన్నా" అని సంబోదించే పదాలు ఆమెకు జరిగే  నష్టం ని తగ్గిస్తాయి. ఇది మొన్న ముంబయి కేసులో విశదమవుతుంది.  అంటే ఎదురు తిరిగే బలం కానీ, పరిస్తితులు కానీ ఉన్నప్పుడు బ్రతిమాలాడాల్సిన అవసరం లేదు .  మాన రక్షణ కొరకు నేరస్తుల ప్రాణాలు తీసిన నేరం కాదని భారతీయ నేర స్మ్రుతి  చెపుతుంది . కేవలం అనువు కానీ వేళలో మత్రమే అలా ప్రవర్తించాలని అస్రం  చెప్పారు .  కానీ    అదే ఆస్రాం బాపు గారు తన మనవరాలి ల లాంటిది అని చెపుతున్న అమ్మాయి మీద లైంగిక దాడి  కి  పూనుకున్నారు అంటే ఎందుకో అంత నమ్మ శక్యం కావటం లేదు.

 అయినా సరే, ఆ భగవంతుడైనా సరే మానవ జన్మ ఎత్తి, ఒక సమాజంలో జీవిస్తున్నపుడు ఆ సమాజపు కట్టు బాట్లను, పాటించి తీరాలి. తన మీద అమ్మయి కుటుంబం వారు చేసినవి తప్పుడు ఆరోపణలే కావచ్చు. ఆ ఆరొపణలును  చట్ట పరిదిలో దీటుగా ఎదుర్కుని, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి. అందుకు రేపు ముప్పయి తేదిన పోలిస్ వారి ఎదుట హాజరు కమ్మన్న సమన్లకు కలత చెందవలసిన  పని ఏమిటీ? దేహత్యాగం చేస్తామని అనడం కూడా సరి అయినది కాదు. దాని వలన పడిన మచ్చ మాసి పోదు సరి కదా, ఆరోపణలే నిజమనుకునే ప్రమాదముంది. అందుకే విచారణ ఎదురుకుని ఆరోపణలు అబద్దమని రుజువు చేసి, ఆరోపితుల మీద చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి తప్పా , దేహాత్యాగం చేస్తామనే మాటలు ఆద్యాత్మిక గురువులకు శోభనివ్వవు.      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!