భారత దేశంలో ప్రియురాళ్ళకున్న పవర్ ఇల్లాలుకు ఉండదనుకుంటా!

                                                               



  
                                                              ఎందుకో ఈ రోజు నాకు మన రాజధాని మదిలో మెదిలింది. అటు తెలంగాణా వారికి ఇటు ఆంద్రావారికి ఈ నగరం మీద ఇంత ఎపెక్షన్ ఏమిటి అని ఆలోచిస్తే నాకు ఆ నగర పుట్టుక  కూడా ఒక కారణమా అనిపించించింది.నిజంగా తెలంగాణా వారిది హైద్రాబాద్. అది ఎవరూ కాదనలేరు. కాకపోతే గత అరవై సంవత్సరాలుగా ఆంద్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల వారు అక్కడికి వచ్చి స్తిరపడ్డారు కాబట్టి, భారతీయులుగా వారికి హక్కు ఉంది కాబట్టి,హైద్రాబాద్ అందరిది అవుతుంది. ఇది పైకి కనిపించే కారణం. అసలు హైద్రాబాద్ కోసమ్ పేచి లేక పోతే ఈ ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు సులువై ఉండేది.

  హైద్రాబాద్ పుట్టిన విదానం పరిశిలిస్తే, అది ముస్లింల ప్రకారం "హైదర్" (సింహం) నివసించే ప్రాంతం అని అర్దమట. కాని కొందరి వాదన ప్రకారం అది భాగ్య నగరం అట. పోని ఆ పేరు ఏమన్నా బాగ్యం (సిరులు,సంపదలు) ఉన్న ప్రాంతం కాబట్టి ,అలా వచ్చిందా, అంటే అహ.. అలా కాదంట కులీ కుతుబ్ షాహ్ ప్రియురాలైన "భాగ్యమతి" అనే నాట్యకత్తె పేరు మీద ఈ నగర నిర్మాణం చేశారట. అదీ కద! అక్కడ వచ్చింది తంటా! కులీ గారి ప్రియురాలు కోసం వెలిసింది కాబట్టే ఈ నగరం అందరికి ప్రియమయింది అనుకుంటా! అదే ఆయన పట్టపు రాణీ కోసం  కడితే ఇంత అట్ట్రాక్షన్ ఉండేది కాదేమో.ఏది ఎమైనా హైద్రాబాద్ పేరును ఆంద్రప్రదేశ్ ఏర్పడగానే  తెలుగులోకి
తర్జూమ చేసి "సింహ గిరి" అని పెడితే బాగుండేమో! దాని బదులు మన వాల్లేమో మాది బాగ్య నగరం, మాది భాగ్య నగరం అని బడాయిగా చెప్పుకుంటుంటే, మొదట్లో హైదరబాద్ అనే ఉర్దూ పేరుకు తెలుగు తర్జూమ యేమో అనుకునే వాడిని. కాని ఆ బాగ్యమతి చరిత్ర చూస్తే, బాగ్యనగరం కంటే హైద్రాబాద్ యే మేలనిపించింది.

  ఒక్క హైద్రాబాద్ విషయమే కాదు ప్రపంచ ప్రసిద్ది చెందిన తాజ్ మహల్ కూడా ప్రియురాలు కోసం కట్టిందే. ఒక కద ప్రాకారం షాజహాన్ ముంతాజ్ కోసణ్ం ఆమె బర్తను సైతం చంపి ఈమెను రాణీ చేసి, అసలు పట్టపు రాణులను నిర్లక్ష్యం చేశాడట!అటు వంటి ప్రేమికురాలి కోసం కట్టబడిన కట్టడం ప్రేమ చిహ్ణాం గా మారి ప్రపంచ వింతలలో ఒకటయింది. ఏదో మన దేశానికి టూరిజం ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి అట్టి ప్రేమలనే అమర ప్రేమలుగా శ్లాగిస్తూ   చరిత్ర పాఠాలు చెప్పుకుంటున్నాం. ఈ విదంగా ఇల్లాలుకి సమాదులు, ప్రియురాల్లుకి నగరాలు ను  కట్టించిన ఆ ఘన చరిత్ర గలిన ఈ దేశం లో పుట్టిన మన తెలుగువారికి  ఆ వాసన అబ్బినట్లుంది. అందుకే బాగ్య నగరం ని వదులుకోలేక పోతున్నారనుకుంటా! అమ్మా బాగ్యమతి, బతికున్నంత కాలం కులీ కుతుబ్షాహ్ గారిని తైతక్కలాడించి ఉంటావు. నీవు చనిపోయాక నీ ఆత్మ ప్రస్తుత రాజులు అయిన తెలుగు ప్రజలను, నీ నగరం కోసం  కొట్టుకునేలా చేస్తుంది!.అవును మరి! ప్రియురాలా ,మజాకా!       


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!