"పవిత్ర యుద్దం" అంటె పసిపిల్లల్ని రసాయనాలతో చంపడమేనా?

                                                                  

  అధికార కాంక్ష మనిషిని ఎంత క్రూరుడిగా మారుస్తాయో, నేడు సిరియా లో జరుగుతున్న మారణ హోమమే సాక్ష్యం.ఒక్కసారి మనిషి రక్తం రుచి చూసిన పులి ఇక ఎన్నటికి సాదు జంతువుగా ఉండజాలదు. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మతాలు, మత ప్రబోదకులు సాద్యమైనంతవరకు మనిషిని క్రూర స్వబావానికి దూరంగ ఉండేలా చేసారు. అయిన మనిషి క్రూరత్వం నుండి విముక్తుడు కాలేక పోతున్నాడు. బుద్దుడిని ఆరాదించేవారు తుపాకులు పెట్టి కాల్చుకుని చస్తున్నారు, కరుణామయుడిని ఆరాదించే వారు బాంబర్ విమానాల ద్వార బాంబులు కురిపించి మరీ ప్రజల్ని హత మారుస్తున్నారు. పవిత్ర యుద్దం(జీహాద్)ద్వారా తనలోని రాగాద్వేషాల మీద యుద్దం చెయ్యడం మాని తమ మతం సూత్రాలని పాటించని వారి మీద యుద్దం చేసే మతస్తులు చివరకు తమ స్వంత బిడ్డల్నే ఎంత క్రూరంగా చంపుతున్నారో, సిరియా సంక్షోబం తెలియ చేస్తుంది.

  సిరియా. పశ్చిమ ఆసియాలో అరబిక్ బాష మాట్లాడె ప్రజలున్న దేశం . దీని మొత్తం జనాబా రెండుకోట్ల యాబై లక్షలు లోపే. అంటే సీమాంద్రలో సగం, లేకపొతే తెలంగాణా ప్రజలు కంటే కోటిన్నర తక్కువే. కానీ అది స్వతంత్ర దేశం. అక్కడ జనాబాలో 74  శాతమ్ మంది సున్నీ ఇస్లామ్ మతస్తులు.13 శాతం మంది షియా మతస్తులు. 10 శాతం మంది క్రిష్టియన్లు మిగతా వారు ద్రజ్ లంట. అంటే 87 శాతం మంది "పవిత్ర యుద్దం " మీద నమ్మఖం ఉన్న ప్రజలే అక్కడ నివసిస్తున్నారు. ఆ పవిత్ర యుద్ద పిపాసులు చివరకు యుద్దం చేస్తుంది ఎవరి మీద అంటే తమ బిడ్డల మీదే.అక్కడ ప్రబుత్వ దళాలకు , ప్రజలకు మద్య అంతర్యుద్దం నడుస్తుంది. ప్రజలను సైన్యం ఊచకోత కోస్తుంది. అధికారిక లెఖ్ఖల ప్రకారమే లక్షల మంది ప్రజలు చంప బడ్డారు. నిన్న నీచంగా ప్రబుత్వమే తన ప్రజల మీద రసాయనిక  దాడి  జరిపి పదిహేను వందల మందిని పొట్టన పెట్టుకుంది. అందులో చిన్న పిల్లలే ఎక్కువట!.ఇలా పాలకులు బరితెగించడానికి ముఖ్య కారణం వారిలోని పదవీ కాంక్ష. నాటి చెంగీఝ్ ఖాన్ నుండి నేటి సిరియా అద్యక్షుడు బసర్-ఆల్-ఆశద్ వరకు అదే నైజం. మానవ హననం. అమాయకులైన పసిబిడ్డలను క్రూరంగా ఊపీరాడకుండా చేసి చంపే రాక్షసులను వారి మతాలు పవిత్ర యుద్ద వీరులు అంటాయో ఏమో కాని అటువంటి వారిని సల సల కాగే నూనెలో వేసి చంపినా పాపం లేదు. అల చేయగల "లోక రక్షకుడు" కోసం ప్రపంచ చిన్నారులు ఎదురు చూస్తున్నారు. చిన్న పిల్లల్ని హింసించే ఏ దేశానికి లేక ప్రాంతానికి  స్వయం పాలిత హక్కు లేకుండా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను సవరించాలి.పసిపిల్లల్ని మించిన దైవ దూతలు లేరు. వారిని హింసించే  ఏ మతస్తులైనా దైవ వ్యతిరేకులే.వారు ఎన్నటికి క్షమార్హులు కారు.              

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం