యాంకర్ అడిగే దానికే సమాధానం దాటవేసే మీరు , రేపు సీమాంద్రుల ప్రశ్న లకు ఏమని సమాదానం చెపుతారు బాబూ!

                                                              
                                                                 
                                                             
  మంచో చెడో, తెలిసో తెలియకో, లేదా పార్టీలోని తెలంగాణ వాదుల ఒత్తిడి వలనో, అధీ కాకపోతే కేంద్రం ఎట్టి పరిస్తితిలోను తెలంగాణా  ఇచ్చే సాహసం చెయ్యదనో,  చంద్రబాబు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని అంగీకార పత్రం పార్టీ తరపున ఇచ్చారు. ఇప్పుడేమో అధికార పార్టీ వారు తెలంగాణకు ఓ.కె అనే సరికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ లోని సీమాంద్రా నాయకులకు గొంతులో పచ్చి వెలకాయ పడినట్లైంది. అటు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఏర్పాటు ఖాయమంటుంటే, ఇటు సీమాంద్ర ప్రజలు సమైఖ్యతకు  తేడా వస్తే తెలంగాణాకు ఒ.కె అన్న పార్టిలను సీమాంద్రలో పూడ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.

 ఇప్పుడు సీమాంద్రకు చెందిన అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతి పక్ష నాయకులు నష్ట నివారణ చర్యల్లో బాగంగా సమైక్యతకు అనుకూలంగ వాదనలు చేస్తున్నా, ప్రజలు వారి చిత్త శుద్దిని నమ్మే పరిస్తితిలో లేరు.అందుకే తమ ఉద్యమ వేదికలను రాజకీయ నాయకులు పంచుకోవడం కాని, సీమాంద్రా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ డానికి చేసే ప్రయత్నాలను కానీ తివ్రంగ అడ్డుకుంటున్నారు. మరి ఇటువంటి సమయం లో తెలంగాణా ఏర్పాటుకు కారకులలో ఒకరు అని సీమాంద్రా ప్రజలు గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు నాయుడు గారు, తగుదునమ్మా అని "ఆత్మ గౌరవం" పేరుతో ప్రజల దగ్గరకు వెళ్ళి పరిస్తితులు వివరిస్తానని అంటే ప్రజలు ఊరుకుంటారా! ఏదైనా జరగరానిది జరిగితే పార్టీకి ఎంత అప్రతిష్ట!

 తన యాత్ర సందర్బంగ నిన్న బాబుగారూ కొన్ని చానల్లకి ఇంటర్వ్యూ లు ఇచ్చారు. అందులో టి.వి.9  తరపున మురలీ క్రిష్ణ అనుకుంటా,బాబు గారి నుంచి ఒకే ఒక ప్రశ్ణకు సమాధానం రాబట్టాలని తెగ ప్రయత్నించినా పలితం లేక పోయింది. అదేమిటంటే, తెలుగు దేశం పార్టీ సమైఖ్యతకు అనుకూలమా కాదా అని సీమంద్రా ప్రజలు నిల దీస్తే ఏమి చెపుతారు? అని అడిగితే, ఇది చాలా సున్నిత సమస్య, ఇటువంటి పరిస్తితిలో మీడియా వారు ప్రజల మద్య ఉద్రిక్తలకు దారి తీసే ప్రశ్నలు కాని, చర్చలు కాని పెట్టకూడదని సలహా ఇచ్చారు బాబు గారు. మంచిది.  బాగుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం కాబట్తీ, ఏమి మట్లాడకుండా కప్పా పాముల మద్య సయోద్య కుదర్చాలి అన్నమాట. మరి ఒక వేళా అదే నిజమయితే బాబుగారు చేఫట్టిన యాత్ర ఉద్రిక్తలకు దారీ తీసేది కాదా? ఇ రోజు యాంకర్ అడిగిన ప్రశ్నే రేపు ఖచ్చితంగా సీమాంద్రా ప్రజలు అడుగు తారు. వారికి కూడా అలాంటి సున్నితమైన ప్రశ్నలు అడగరాదని సలహా లిస్తారా? వారు అడిగే దానికి చెప్పకుండా, మీరు చెప్పేది మాత్రమే వినమంటే ప్రజలు అంత అమా యకంగ ఉన్నారని బావిస్తున్నరా? విజ్ణతతో ఆలొచించడం మంచిది.

 నిజమే కావచ్చు. చంద్ర బాబు గారు అంటున్నట్లు, ప్రజల మద్య తంపులు పెడితే తప్పా కాంగ్రస్  పార్టీకి తెలుగు నాట సీట్లు పొందే పరిస్తితి లేక పోవచ్చు. రాష్ట్రం లో ఎవరున్నా పర్వా లేదు, కేంద్రం లో తమకు సప్పోర్ట్ చేస్తే చాలు అని అధిష్టానం బావిస్తుండవచ్చు. అందు కోసం తెలంగాణలో T.R.S. వారితో, సీమాంద్రలో వేరొకరితో రేపు ఎన్నికల అవగాహాన కుదుర్చు కోవచ్చు. రాహుల్ గారిని డిల్లీ పీఠం మీద కూర్చో బెట్టేందుకు తెలంగాణ ప్రకటణ చేసి ఉండవచ్చు. అందులో బాగంగా తెలుగుదేశం పార్టీని తెలుగు నాట మట్టి కరిపించడానికి పదక రచనలో బాగమే ఇదoతా కావచ్చు. అంత మాత్రం చేత సమయా సమయాలు చూసుకోకుండా, మనో బావాలు దెబ్బ తిన్నాయని ప్రజలు బాదపడుతుంటే, ఉపాది పోతుందని యువత శివాలెత్తుంటుంటే, ఈ కాక మీద, ఆ కాకకి కారణం అయిన వారు వారి మద్యకు వెళితే ఏమి జరుగుతుందో ప్రజల నాడీ తెలిసిన చంద్ర బాబు గారికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఉందా? అందరూ వద్దంటున్నా వెలతానంటే రేపు మరొక "దక్ష యజ్ణం" ని చూడాల్సిన పరిస్తితి ఉందేమో అని అనుమనం కలుగుతుంది.                

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!