మానభంగం కంటే ఘోరమయింది "మర్యాద భంగం"!
మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మంచిపనిని అతి త్వరగా చేశారు.అదే నండి మహిళా రక్షణ కొరకు "నిర్భయ"బిల్లును చట్ట రూపం లోకి తెచ్చారు. ఈ సవరణ చట్టం వలన ఇక నుండి "మాన భంగం " నేరస్తులకు కటిన శిక్షలు విదించే వీలు ఉంటుంది.అంత వరకు సంతోషమే.కాని పరస్పర అంఘీకార శ్రుంగారానికి పద్దెనిమిదేళ్ల వయసును నిర్దారించడం కొంత అబ్యంతరకరమే. బారతదేశం లో విశిష్టమైనది, బలమయినది కుటుంభ వ్యవస్త.ఆటువంటి కుటుంభ వ్యవస్తకి పునాది "మనువు" . అంటే వివాహం. ప్రతి తండ్రి తన కుమార్తెను యోగ్యుడైన వరునికి ఇచ్చి పెండ్లి చేయ్యాలని కోరుకుంటాడు. " "కన్యాదానం" అనేది వివాహ తంతులో అత్యంత ప్రాదాన్యత గలది. అలాగే పెండ్లి అనేది పూర్తిగా మతపరమయిన చర్య. దీనిలో చట్టం జ్యోక్యం చేసుకోవడమంటే అది మతపరమయిన ప్రాదమిక హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది. మరి ఇటువంటి పరిస్తితిలో కుటుంభ సబ్యులకు "అంగీకార శ్రుంగారం" వయస్సును చట్టం ఎలా నిర్దారిస్తుంది? పెండ్లి కాని యువతీ యువకులు కేవలం చట్టం అనుమతించిందని "శ్రుంగారానికి " సై అంటే వారిని నియంత్రించే అదికారం "కుటుంభ" సబ్యు...