సైన్స్ కు సవాలు విసురుతున్న "పుట్టనహళ్లి కుక్క "
ఈ ప్రపంచం లో జరిగే సంఘటనలు అన్నింటికి సంతృప్తికరమైన సమాధానం ని సైన్స్ ఇవ్వలేదన్నది నిష్టుర సత్యం. ఉదాహరణకు ఒకే ఇంట్లో పుట్టి పెరిగి , ఒకే రకమైన వాతావరణం లో పెంచబడిన పిల్లలకు భవిష్యత్ ఒకేలా ఉందని వారు ఎందరో! కాలాంతరం చేత ఒకడి బ్రతుకు బంగారుమయం అయితే , మరొకరి బ్రతుకు కడగండ్ల పాలు అయినా ఉదంతాలు తక్కువేమి కాదు. దీనికి కర్మ సిదాంతం చెప్పినంత సంతృప్తికరమైన సమాధానం సైన్స్ చెప్పలేదు. ఒకే ఇంట్లో పుట్టినా వారి వారి పూర్వజన్మ కృత్యాలు లో ఉన్న బేధాలు వలననే ఈ జన్మ లో వారికి ఆ విభిన్న ఫలితాలు అని కర్మవాదులు చెప్పే మాటలు సామాన్యుణ్ణి సంతృప్తిపరచినట్లు , సామాన్య శాస్త్రం ప్రకారం చెప్పే సిద్దాంతాలు సామాన్యుని సంతృప్తి పరచలేవు. అదిగో అలా సామాన్యుడినే కాదు, అంతో ఇంతో సైన్స్ జ్ఞానం ఉన...