Posts

Showing posts with the label ism

పవన్ కళ్యాణ్ "ఇజం " ద్వారా రాజు రవితేజ ఆవిష్కరిస్తున్న "నిజం" ఏమిటి?

                                                                        నూతనంగా రాజకీయ పార్టి పెట్టబోయే ప్రతి ఒకరికి ఏదో ఒక ప్రత్యెక "ఇజం" ఉండాలా ? అవును ఉండాల్సిందే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ . దాని ద్వారా నే పార్టి ఉద్దేశ్యాలు , ఆశయాలు , తెలుస్తాయి .మరి పార్టి మానిపెస్తో ఎందుకు? పార్టి ఆశయాలను   సాదించడానికి రానున్న 5 యేండ్ల కాలంలో తాము ఏర్పరచుకున్న ప్రణాళికలు , వాటి అమలు విదానం ఇవ్వన్ని తెలియ చేసేదే "పార్టి మేనిపెస్తో ". మరి ప్రజలకు కావాల్సింది పార్టి "ఇజమా ? లేక మేనిపెస్తో నా అంటే ఖచ్చితంగా మేనిపేస్ట్ యే అని అనక తప్పదు .     ఇలా ఖచ్చితం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే , ఎన్నో ఇజాలు పుట్టాయి . అన్ని ఇజాలులొ అంతో ఇంతో నిజం ఉంటుంది . కాని ఏ ఇజం కూడా అందర్నీ సంతృప్తి పరచేలా ఉండదు . ఎవరి ఇజం వారికే కరెక్టు అనిపిస్తుంది . ఈ ఇజాలు గురించి భారత దేశ ప్రజలు విని , విని ఉండటం వలన వారికి ఇజాల మిద ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు . పవన్ కళ్యాణ్  గారి "ఇజం " గురించి వినపడుతున్న వార్తలు పట్టి చూస్తె అది భారత రాజ్యాంగo లాంటిదేమో అన్న అనుమానం కలుగుతుంది .