పవన్ కళ్యాణ్ "ఇజం " ద్వారా రాజు రవితేజ ఆవిష్కరిస్తున్న "నిజం" ఏమిటి?

                                                                       

నూతనంగా రాజకీయ పార్టి పెట్టబోయే ప్రతి ఒకరికి ఏదో ఒక ప్రత్యెక "ఇజం" ఉండాలా ? అవును ఉండాల్సిందే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ . దాని ద్వారా నే పార్టి ఉద్దేశ్యాలు , ఆశయాలు , తెలుస్తాయి .మరి పార్టి మానిపెస్తో ఎందుకు? పార్టి ఆశయాలను   సాదించడానికి రానున్న 5 యేండ్ల కాలంలో తాము ఏర్పరచుకున్న ప్రణాళికలు , వాటి అమలు విదానం ఇవ్వన్ని తెలియ చేసేదే "పార్టి మేనిపెస్తో ". మరి ప్రజలకు కావాల్సింది పార్టి "ఇజమా ? లేక మేనిపెస్తో నా అంటే ఖచ్చితంగా మేనిపేస్ట్ యే అని అనక తప్పదు .
    ఇలా ఖచ్చితం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే , ఎన్నో ఇజాలు పుట్టాయి . అన్ని ఇజాలులొ అంతో ఇంతో నిజం ఉంటుంది . కాని ఏ ఇజం కూడా అందర్నీ సంతృప్తి పరచేలా ఉండదు . ఎవరి ఇజం వారికే కరెక్టు అనిపిస్తుంది . ఈ ఇజాలు గురించి భారత దేశ ప్రజలు విని , విని ఉండటం వలన వారికి ఇజాల మిద ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు . పవన్ కళ్యాణ్  గారి "ఇజం " గురించి వినపడుతున్న వార్తలు పట్టి చూస్తె అది భారత రాజ్యాంగo లాంటిదేమో అన్న అనుమానం కలుగుతుంది . ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరి ఆలోచనలు అందులో ఉన్నట్లు ఉన్నాయి . మరి వాటి అమలు సాద్యపడుతుందా ?చూదాం !
   భారత రాజ్యాంగాన్ని కాపాడతామని ,దానిలో చెప్పిన విధంగానే విదులు నిర్వహిస్తాం అని బహిరంగంగా ప్రతిజ్ఞ చేసిన తల పండిన పెద్దలు , తమ పంతం నెరవేర్చుకోవడం కోసం పార్లమెంటు తలుపులు మూసి ,లైవ్ టెలికాస్ట్ ఆపి , నిర్లజ్జగా రాష్ట్ర విభజన చేస్తుంటే ఇదే కరక్టే అన్నవారు కొందరు, తప్పన్న వారు మరి కొందరు . చివరకు అందరు తలవంచి పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడ్డారు . మరి భారత రాజ్యాంగానే వక్రబాష్యాలతో ఉల్లంగిస్తే దిక్కు లేని దేశంలో అప్త్రాల్  "ఇజాలు " గురించి ప్రజలకు పెద్ద పట్టింపు ఏమి ఉంటుంది ?

   అయినా సరే మేధావులకు "ఇజం " గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది . పవన్ కళ్యాన్ గారు చెపుతున్న "ఇజం" అనే పుస్తకం రచన వెనుక రాజు రవి తేజ అనే అయన ఉన్నారట . పవన్ కళ్యాన్ అయన కలసి గత 5 ఏండ్లుగా సమాజం లో తీసుకు రావాల్సిన మార్పులు గురించి , అలోచించి , అలోచించి చివరకు "ఇజం" ని రూపొందించారట . మరి అది ఎవరి గురించి చెప్తున్న నిజమో ఈ రోజు సాయంత్రానికి కాని తెలియదు.నా అభిప్రాయం అయితే అటు సోషలిజం , ఇటు ట్రెడిషనలిజం  కు మధ్యే మార్గంగా ఒక కొత్త ఇజం గురించి పుస్తకంలో రాసినట్లు ఉంది . రాజు రవితేజ గురించి మంచి ట్రాక్ రికార్డే ఉన్నట్లు అనిపిస్తుంది . ఎ ఇజం అయినా అంతో ఇంతో సమకాలిన సమస్యలకు పరిష్కారం చూపగలిగితేనే దానికి కొంత సార్ధకత . లేకుంటే పేరు గొప్ప !ఊరు దిబ్బ ! అన్న చందమే ! పవన్ గారి ఇజం అ విదంగా కాకుండా ప్రస్తుత సమస్యల పరిష్కారానికి ఒక కొత్త దారి చూపుతుందని ఆశిద్దాం .

         ఇజం కర్త లలో ఒకరైన రాజు రవి తేజ గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
                  

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.