"ఆమె" గురించి ఆంద్ర ప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియక పోవచ్చునేమో !?
ఆమె! ఒక అమ్మగా , ఒక అక్కగా , ఒక అలిగా, ఒక బిడ్డగా , మన మధ్యే ఉంటుంది . మన తోనే ఉంటుంది . ఆమె ను అబల అని తెలియని కొందరంటే , కాదు ఆదిశక్తి అని ఆమె గురించి పూర్తిగా తెలిసిన వారు అంటుంటారు . అందుకే ఆమె శక్తిని తెలిసిన వారు ఆమెను పూజిస్తుంటే , తెలియని రాక్షసులు ఆమెను చెర బట్టి హింసించాలని చూస్తుంటారు . ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని విశ్వసించిన భరత జాతి మనది . "గౌతమి పుత్ర శాత కర్ణి , వాసిష్ట పుత్ర పులుమావి అని తల్లి పేర్లను తమ పేర్ల ముందు చేర్చుకుని గర్వంగా మీసం మేలేసిన వారు మన ప్రదమాంద్ర పాలకులు . కాబట్టి ఆ "ఆమె" గురించి తెలుగు వారికి ఎల్లప్పుడూ సద్బావనే !
కాని "ఆమె"లో ఉన్న పాజిటివ్ గుణం ఆమెను గౌరవించేలా చేస్తుంటే , నెగటివ్ గుణం ఆమె ను ద్వేషించే లా చేస్తుంది . అప్కోర్స్ ఇదే సూత్రం "అతడు"కు కూడా వర్తిస్తుంది . ఆమె తలచుకుంటే తల్లిలా కుటుంబం ని కలిపి ఉంచగలుగుతుంది, కాదనుకుంటే కోపం వచ్చిన కోడలిలా అదే కుటుంబాన్ని నిట్ట నిలువునా చీల్చి వేయ గలుగుతుంది . ఇది కేవలం కుటుంబానికే కాదు , రాజ్యానికి వర్తింప చేస్తుంది . ఆ అనుభవాన్ని పొందిన వారు కూడా ఆంద్ర ప్రదేశ్ ప్రజలే . 1972 సంవత్సరం లో జై ఆంధ్రా ఉద్యమం పేరిట సిమాంద్ర ప్రజలు తమకు ప్రత్యెక రాష్ట్రం కావాలని గొడవచేస్తే , అలా వద్దని , రాజ్యంగ సవరణల రూపంలో కొన్ని తాయిలాలు ఇచ్చి మరీ రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఆంద్ర ప్రదేశ్ లా ఉంచిన శ్రీ మతి ఇందిరా గాంది గారు ఒక "ఆమె". అలాగే 2014 లో అదే సిమాంద్ర ప్రజలు కలసి ఉంటాం అని ఎంతగా మొత్తుకుంటున్నా వినకా ఆంద్ర ప్రదేశ్ ను రాజ్యాంగ పద్దతులను తోసి రాజని "తెలంగాణా" ను విడగొట్టిన , సాక్షాత్ శ్రీమతి ఇందిరా గాంది గారి కోడలు , శ్రీమతి సోనియా గాంది గారు కూడా ఒక "ఆమె". విచిత్రంగా సోనియా గాంది గారి కోరిక నెరవేర్చడానికి సహాయపడిన శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కూడా ఒక "ఆమె ". . అ రోజు వందల మంది మగాళ్ళను కాదని తెలుగు రాష్ట్రాన్ని కలిపి ఉంచినా , ఈ రోజు అదే మగాళ్ళని కాదని రాష్ట్రాన్ని విడ దిసినా అది "ఆమె"కే చెల్లింది . దాని వలన కొందరు "ఆమె" ను "అమ్మా", "దేవత" అని అంటుంటే , కాదు దెయ్యం అంటుంటారు కొందరు . ఈ రెంటికి "ఆమె " అర్హురాలే కావచ్చు .
ఏది ఏమైనా "ఆమె" లేని పురుషుడు సంపూర్ణ మనిషి కాజాలడు . "ఆమె" ను పురుషుడు నుంచి విడ దీసి చూడాలనుకోవడం అంత మూర్కత్వం మరొకటి లేదు . కాబట్టి మనిషి లో సగ పాలైన "ఆమె" పేరిట జరుగుతున్న ఈనాటి "అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు "మనలో సగ బాగమైన "ఆమె"కు .సమాన గౌరవం , అన్ని రంగాల్లో సమాన ప్రాతినిద్యం ఇవ్వడానికి సిద్ద పడడమే "ఆమె" కు మనం తెలిపే నిజమైన శుభాకాంక్షలు .
Comments
Post a Comment