ఈ దేశంలో "లింగాలను" మార్చవచ్చు !కాని ’"జంగాలను" మార్చలేరు!
మన సమాజం లో అనాదిగా ఉంటూ, అంతో ఇంతో "స్వచ్చత" కలిగింది ఏదయినా ఉందా అంటే అది ఒక్క "కుల వ్యవస్తే’ అని చెప్పాలి. వ్యక్తులు ఒక కులంలో పుడితే, వారు చనిపోయేదాక ఆకులం లోనే జీవించాలి. మతం మారవచ్చు. పార్టిలు మారవచ్చు, ఆకరికి పురుషుడు స్త్రీ గా మారవచ్చు,అంటె "లింగ మార్పిడి". కాని’కుల మార్పిడి" అనేది జరగదు.కాబట్టి’మతం కన్నా కులమే ప్రామాణికమయినది. అందుకే కాబోలు మన ప్రభుత్వాలు వెనుక బాటు తనం నిర్దారణకు "కులాన్నే" ప్రామాణికంగా తీసుకున్నారు. విచిత్రమయిన విషయం ఏమిటంటే, "హిందూ" మతం నుండి అన్య మతాలలోకి వెల్లిన వారు సైతం ఈ మతం ఒక్క పునాది, బావజాలమయిన "కులాన్ని" అంటి పెట్టుకునే ఉండడం.అసలు హిందూ మూలాల్ని వదలని వారిని "అన్య మతం" లోకి ఎలా ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఒక్క కారణం వల్లనే "మత మార్పిడి" అనేది భొగస్ అని చెప్ప వచ్చు. "హిందూ దేశంలో" ఉన్న ప్