మంత్రి గారి కారుకు, చంద్రబాబు గారి బస్సుకు బాణామతి చేసిందెవరు?
ఈ మద్య వారం రోజుల వ్యవదిలోనే మన రాష్ట్రంలో ముఖ్యులైనటువంటి వారి వాహానాలు ప్రయాణిస్తూండగానే హట్టాతుగా మంటలంటుకుని తగల బడ్డాయి. వాటికి కారణం "షార్ట్ సర్క్యూట్" గా పేర్కొన్నారు పోలిసులు. అది బౌతికంగా కనిపించే కారణమైనప్పట్టికి, కేవలం రెండు మూడు రోజుల వ్యవదిలోనే ఇలా వరుసగా ఎందుకు ఈ "షార్ట్ సర్క్యూట్" లు జరిగాయి అనేది వింత అయిన విషయం. మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న "ఆత్మ గౌరవ యాత్ర", బస్సులోనుంచి పొగలు వస్తే, దానిని సకాలంలో గమనించటం వలన ఆయన క్షేమంగా బయట పడ్డారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎకడో కారు ఒకటి రోడ్డు మీదే తగలబడి పోయింది. మొన్న ఉద్యానవన శాఖ మంత్రి శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి గారి కారు కూడ భువన గిరి ద...