మంత్రి గారి కారుకు, చంద్రబాబు గారి బస్సుకు బాణామతి చేసిందెవరు?                                                           

 ఈ మద్య వారం రోజుల వ్యవదిలోనే మన రాష్ట్రంలో ముఖ్యులైనటువంటి వారి వాహానాలు ప్రయాణిస్తూండగానే హట్టాతుగా మంటలంటుకుని తగల బడ్డాయి. వాటికి కారణం "షార్ట్ సర్క్యూట్" గా పేర్కొన్నారు పోలిసులు. అది బౌతికంగా కనిపించే కారణమైనప్పట్టికి, కేవలం రెండు మూడు రోజుల వ్యవదిలోనే ఇలా వరుసగా ఎందుకు ఈ "షార్ట్ సర్క్యూట్" లు జరిగాయి అనేది వింత అయిన విషయం.

  మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న "ఆత్మ గౌరవ యాత్ర", బస్సులోనుంచి పొగలు వస్తే, దానిని సకాలంలో గమనించటం వలన ఆయన క్షేమంగా బయట పడ్డారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎకడో కారు ఒకటి రోడ్డు మీదే తగలబడి పోయింది. మొన్న ఉద్యానవన శాఖ మంత్రి శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి గారి కారు కూడ భువన గిరి దగ్గర పూర్తీగా కాలి పోయింది.అది కూడా సకాలంలో గమనించబట్టి మంత్రి గారు క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత హైద్రాబాద్లో కూడ ఇలాగే ఒక కారు తగలబడి పోయింది. వీటన్నింటికి ఒకటే బౌతిక కారణం "షార్ట్  సర్క్యూట్".

 నేను కొన్నేళ్ళుగా కొన్ని సంఘటణలను ఆసక్తిగ గమనిస్తూ ఉన్నాను. ఒక రోజు ప్రయాణంలో  ఒక బస్సు అదుపు తప్పి పక్కనున్న చెరువులోకి పోయి పల్టీ కొట్టిందనే వార్త వస్తే అదే తరహా సంఘటణలు వెన్వెంటనే కొద్ది రోజుల తేడాతో జరుగుతుంటాయి. అందులో డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందనేది పైకి కనపడే  బౌతిక కరణం అయినప్పటికి, వరుసగా ఆ డ్రైవర్లని చెరువులలోకి, వాగుల్లోకి, నదుల్లోకి లాకెళ్ళుతున్న సీక్రెట్ కారణం ఏమైన ఉంటుందా అనేదే నా డౌట్!అందుకే గత వారం రోజుల లోపు జరిగిన ఈ వరుస సంఘటణలు విన్నాక, ఇలా సీరియల్ షార్ట్ సర్క్యూట్ లూ ఇంత షార్ట్ పిరియడ్లో జరగటం వెనుకాలా  షార్ట్ సర్క్యూట్ కాక వేరే ఏమైన కారణం ఉందా? ఉంటుందా? ఎవరికైన తెలిస్తే చెప్పగలరు.

   సాదార్ణంగా మనం మూడ నమ్మకాలుగ బావించే "బాణామతి" లాంటి క్షుద్ర విద్యలు లో ముఖ్యంగా హట్టాత్తుగ బట్టలు తగలబడటం , ఇండ్ల మీద రాళ్ళు పడటం జరుగుతాయి అంటుంటారు. అలా అయితే ఈ మద్యనే ఖమ్మం శాసన సబ్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారి కారు మీద, ఇంకొక నాయకుడి కారు మీద రాత్రి పూట రాళ్ళు పడి కార్ల అద్దాలు పగిలాయట! మరి ఆ తర్వాతే ఈ సిరియల్ అగ్ని ప్రమాదలు. అంటే వాహనాలకు ఎవరైనా "బాణామతి" చేసారంటారా!

 వాహనాలకు బాణమతి చేసారో లేదో కాని మన రాష్ట్రానికి మాత్రం చేతి గుర్తు వారు మాత్రం  "చేతబడి" చేసారు. అందుకే కాముగ ఉన్న రాష్ట్రం ఒక్క సారిగా గగ్గోలు ఎత్తుతుంది. ఒకటి పోయి, రెండు పోయి, చివరకు మూడు చెక్కల్లయ్యే  పరిస్తితికి వచ్చింది.పాపాత్ముల ద్రుష్టి పడితే పచ్చటి కాపురం కూడా బగ్గుమంటుంది అని, డిల్లీ వారీ "చేత"బడికి  గల్లీ,గల్లీ ఘొల్లుమంటుంది. మూడ బాణమతి మీద యుద్దం చెయ్యడానికి చాలా మంది విజ్ణానులు ముందుకు వస్తారు. మరి ఈ చేత బడిని ఆపె దమ్మున్న రాజకీయ మాంత్రికుడెవరు?              

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!