హాంపట్..ఆమెను చంపి,అతడిని 13 వ అంతస్తు నుండి తోసేసి చంపిన ఆ భూతం ఏవరో తెలుసా!?


                                                             


 దెయ్యం! భూతం! కాష్మోరా!మోహినీ! పిశాచీ! కొరివి దెయ్యం! ఇవ్వన్నీ మనిషిని ఆవహించి వారిని ఉన్మాదులను చేసే మానసిక రోగాల పేర్లు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఉన్మాదానికి గురైన వారికి ఎటువంటి విద్యా అర్హత లేని మంత్రగాళ్ళు, భూత వైద్యులు, పకీర్లు ఈ ఉన్మాదాన్ని వదిలిస్తున్నారు. దెయ్యం పట్టి చనిపోయిన వారు ఉన్నట్లు ఉదంతాలు లేవు అనుకుంటా!కానీ కాష్మోరా ను మించిన భయంకర బూతం ఇప్పుడు యువతను ఆవహించి వారి ప్రాణాలను వారే తీసుకునేటట్లు చేస్తుంది. ఈ భూతం పుట్టేది ఎందులో తెలుసా? నవ నాగరిక జీవన విదానం లో!ఈ భూతం ఎవరిని ఆవహిస్తుందో తెలుసా? చదుకోని వారి జోలికి అసలు పోలెదు. చదువుకున్న వారి లోనే తిష్ట వేసి వారు చచ్చే వరకు వేదిస్తుంది. వీరికి భూతం పట్టిందని వీరికి తెలియదు, వీరీ చుట్టూ ఉండే నవ నాగరీకులకు తెలియదు. తీరా వారు చని పోయాక మాత్రం" పిచ్చోళ్ళు! ఇంత చిన్న విషయానికే చని పోతారా!" అని ఒక నిట్టూర్పు విడుస్తారు. మరి ఇప్పట్టికైనా ఆ భూతం ఏదో గ్రహించారా? దాని పేరే "స్ట్రెస్". మానసిక ఒత్తిడి.నేడు పదహారేళ్ల  పాటు చదువుకుని ,గొప్ప ఉద్యోగం పొంది, నిరంతరం కంప్యూటర్ల ముందూ కూర్చుని, సమాజం లోని ఇతర విషయాలు గురించి పట్టించుకోవడానికి కూడా తీరిక లేనంతగా కష్టపడుతున్న నవ నాగరిక యువతకు మిగులుతుంది మానసిక ఒత్తిడి. ఆ ఒత్తిడి వారిని ఉన్మాదులను చేస్తుంది. మెరుగైన జీవితం కోసం వారు చేస్తున్న పని, చివరకు వారిని ఆత్మ హత్యలు చేసుకునేలా పురిగొల్పుతుంది. దానికి ఉదాహరణే ఇ ఉదంతం.

  అతని పేరు మధుసూదన్. ఆమె పేరు రూప. ఇరువురూI.T. ఇంజనీర్లే. బెంగుళూర్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ళ క్రితం పెళ్లైంది. ఐదేళ్ళ పాప ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటుండే వారు అట!కానీ గత కొంత కాలంగా వారి మద్య చీటికి మాటికి గొడవలు వస్తున్నాయి. పెద్దవాళ్ళ వద్ద వారి గొడవల విషయం గురించి పంచాయతి పెడితే , ఆ పెద్దలకు వీరి గొడవలు చాలా సిల్లీగా అనిపిస్తూ, వీటికి కూడా గొడవలు పడి సంసారాన్ని ఆశాంతి పాలు  చేసుకుంటారా, అని ఆశ్చర్య పోయారట. ఎన్ని సార్లు సర్ది చెప్పినా, భార్యా భర్తలలో మార్పు రాలేదు.

    మొన్న శుక్రవారం, రూపా తండ్రి గారి పుట్టిన రోజు. ఆ పుట్టిన రోజు పంక్షన్ కి వెళ్ళడానికి కూడా పెద్ద గొడవే జరిగిందట. కోపంతో మధుసూదన్ తమ కూతురుని తన తల్లి తండ్రుల దగ్గర వదలి వచ్చాడు. దానితో రెచ్చిపోయిన రూపాతో మల్లీ గొడవపడి ఆ కోపం లో విచక్షణ కోల్పోయిఒ కత్తితో కసా, కసా 11 సార్లు  పొడిచి భార్యను చంపాడు. తర్వాత ఉరి వేసుకుని చావలనుకుంటే మద్యలో తాడు తెగిందట ! ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకోవాలనుకున్నాడట! కానీ అగ్గి పుల్ల వెలగ లేదు . అయినా అతని లోని భూతం వదిలి పెట్టలేదు, పై నుండి దూకి చావు అని ప్రేరేపిస్తే పదమూడవ ఆంతస్తుకు వెళ్ళి అక్కడ నుండి దూకి చనిపోయాడు. ఆ విదంగా ఆ I.T.   ఇంజనీర్ల జీవితాలు ముగిసాయి. ఇక ఆ అయిదేళ్ళ పాప చదవడానికి రెడి అవుతుంది. మరో పదహారేళ్ళలో ఆమె కూడా  తల్లి మాదిరి  I.T ఇంజనీర్ అయి, తండ్రి లాంటి I.T ఇంజనీర్ ని చేసుకుని తల్లితండ్రుల చరిత్రయే పునరావ్రుతమవుతే, ఇక ఆ వంశానికి ఒక తరం అంటే "పాతీకేళ్ళు" అని స్తిరపడుతుంది.

   ఇదేదో ఒక రూపా, మధుసూదన్ల సమస్య అనుకోవడానికి వీలు లేదు. బవిష్యత్ సంసారాల ముఖ చిత్రం ఇదే. చీటికి మాటికి గొడవ పడటం సాంప్రదాయ సంసారులకు సిల్లీగా అనిపించినా, ఆధునికుల మనసులో ఉన్న "స్త్రెస్" "ఇగో "భూతాలు  ఆడించే డ్రామా గా అర్దం చేసుకోలేరు. పాతికేళ్ళకే సైకియాట్రిస్ట్ ని కలవడానికి యువ దంపతులు అసలు ఒప్పుకోరూ అనటం కంటే వారిని అంగీకరింప చెయడానికి వారిలోని "ఇగో" అనే మరో దెయ్యం ఒప్పుకోదు. సంసారం అంటే సర్దుకు పోవడం అనే సాంప్రదాయ బావం నుండి, చిన్న విషయానికైన చికాకులు చేసుకునే "జ్ఞాన రహిత స్వేచ్చా బావం" నేటి యువతను డామినేట్ చేస్తుంది. ఒక ప్రక్క, చేసే ఉద్యోగం ద్వారా పొందే "ఒత్తిడి", మరొక పక్క ఆధునిక బావజాలం బోదిస్తున్న "మితి మీరిన స్వేచ్చా" విదానం ఇవ్వన్నీ పిచ్చోళ్ళని చేసి యువతను చంపేస్తుంది.

  పూర్వ కాలపు నగర సంస్క్రుతి   ఎందుకు నాశనం అయిందో చరిత్ర కారులు ఇదమిద్దంగా చెప్ప లేక పోతున్నారు. విదేశి దండ యాత్రలు అని చెప్పే ఏకైక కారణం కరెక్ట్ కాక పోవచ్చు. నగర జీవన విదానం లోనుండి పుట్టే మానసిక భూతాల ప్రేరణతో ప్రజలు ఒకరి నొకరు చంపుకోవడం  చేసి ఉంటారా ? భారతం లో యాదవులు  మాదిరే చనిపోయారని ఉంది .. ఈ మద్య అమెరికాలో ఉన్మాదులు పేట్రేగి పోవడానికి ఇదే కారణం కావచ్చు. మరి అటువంటి భూతాలను జన్మింపచేసే  ఆదునిక   నగర సంస్క్రుతి మానవాళికి అవసరమా? దీనికి తగిన పరిష్కారం కనుకొనక పోతే  మన నగర సంస్క్రుతి , చరిత్ర దిబ్బల క్రింద పూడుక పోక తప్పదు కాక తప్పదు.    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన