ఆ దేశం లో అయితే ఉరేస్తారట! ఈ దేశంలో అయితే ఉరేగిస్తారట!

       

 నిన్న ఫేస్ బూక్ లో ఒక పోస్ట్ చూసాను. చైనాకి మనకి అవినీతి విషయంలో ఎంత అభిప్రాయబేదం ఉందో అర్దమవుతుంది.మనo వ్యక్తి ద్రుక్పదమే తప్పా ,సామాజిక ద్రుక్పదం అంతగా లేనివారం.మనవారు   అభిమాన నటుడి సినిమా పైరసీ చేస్తే, అంకమ శివాలెత్తి పోతారు, అదే ప్రజల సొమ్ము దోచినోడి గురించి ఒక్క మాటా మాట్లాడలేరు.

  చైనా లో అవినితికి పాల్పడితే ఉరిశిక్ష విదిస్తారట. అంటే అది మనకు "నిర్భయ" కేసు ఎలాగో వారికి అవినీతి కేసు అలాగ అన్న మాట.మరి వారికి మనకి సామాజిక ద్రుక్పదంలో అంత తేడా ఎలా వచ్చింది? మనం దోపిడిని అంతలా ఎలా సహిస్తున్నాం? పైపెచ్చు అలా దోచిన వారినే మన హీరోలు అంటున్నాం. వారినే పూజిస్తున్నాం. వారికోసం ప్రాణలు సైతం అర్పించడానికి వెనుకాడని అమరవీరులు మన సమాజంలో ఉన్నారు అంటే చైనా వారికి మనకి  తేడా ఎక్కడ వచ్చిందో అర్దం కావటం లేదు. ఈ మద్య ఒక మిత్రుడు నాకొక కద లాంటిది చెప్పా డు. అందులో వాస్తవం ఉంది అన్నాడు. మరి ఉందో లేదో మీరే చెప్పండి.

  చెంగీజ్ ఖాన్ తన దండ యాత్రల సమయంలో ఒక టెక్నిక్ పాటించేవాడు అంట. అతను ఎప్పుడూ తన అనుచరులను ,తను జయించిన రాజ్యాలలో రాజులుగా నియమించలేదట! ఏ రాజ్యాన్ని తను హస్తగతం చేసుకోలెదట. తన ఆలోచన ఒకటే నట. ప్రపంచం మొత్తంమీద తన జాతే ఉండాలని. అందుకే అతను ఏ రాజ్యం మీద దండ యాత్ర చేసిన అక్కడి ప్రజలను,సైన్యాన్ని ఊచకోత కోసి, అక్కడి స్త్రీలను చెరపట్టి తన సైన్యంతో కలిసేలా చేసేవాడట. దానివలన అక్కడి సంతతి అంతా తన జాతి సంతతి అవుతుందని అతని పదకం అట!అందుకే అతను దండ యాత్రలు చేసిన ప్రాంతాలులో అతని జాతి సంకరం ఉంది.

 అలాగే మన దేశం లోకూడా దండ యాత్రలు అనేకం జరిగాయి. మనకు ఉన్న ఏకైక లక్షణం ఏమిటంటే అనైక్యత. అన్నను దోపిడి చేస్తుంటే తమ్ముడు నవ్వా, తమ్ముడిని దోపిడి చేస్తుంటే అన్నా నవ్వటమే జరిగేది. అలా మొత్తానికి అందరూ దోపిడికి గురి కాబడిన వారే. అలా దోపిడి చేయబడటానికి అలవటు పడిన మన జాతీలో చేతకాని తనం  అనే వైరస్  అభివ్రుద్ది చెందింది. దాని వలన దోపిడిని ఎదిరించే దమ్ము లేక దోపిడి చేయటానికి వచ్చినోడికల్లా "సలాం" లు చేయటం మొదలు పెట్టాం. అలా సలాములు చేసే గుణాన్ని"శాంతి ప్రియత్వం" "సహన శీలత్వం" అనే పేర్లు పెట్టుకున్నాం. దోపిడి చేసేవాడిని వీరుడు,శూరుడు అని పడి పడి మొక్కటం అలవాటు చేసుకున్నాం.అదిగో అలా అలవాటైన మన బ్రతుకులుకు దోపిడికి కారణమైన అవినీతిని బరించే శక్తి వంశ పారంపర్యంగా వచ్చింది కాబట్టి అది మన రక్తంలోనే ఉంది. కాబట్టి అవినీతి పరున్ని అవమానించాటమంటే మన రక్తాన్ని మనం అవమానించుకున్నట్లే. చైనా వారి రక్తంలో ఆ వైరస్ లేదు కాబట్టి వారికి అది అంటే వళ్లు మంట. అందుకే వారు అవినీతిపరుల్ని ఉరి వెయ్యలంటరు.

  మరి మనలో ఉన్న ఈ వైరస్ పోవాలంటే ఏం చెయ్యాలి? "జీన్ తెరపీ" .సైంటిస్ట్ లు బవిషత్ లో ఏమన్నా జీన్ తెరపీ కనిపెడితే అలా జాతికి తెరపీ చేయవచ్చు. అది కూడ సాద్యపడకపోతే అవినీతినే చట్టబద్దం చేస్తే సరి. దోచుకున్నవాడికి దోచుకున్నంత. ఆ విదంగా దోపిడి చట్టబద్దమైనపుడు చైనా వారిని చూసి మనం బాదపడాల్సిన పని లేదు కదా! వారిది అయినా, మనది అయినా చట్టబద్దాలే!                                                               

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )