పదమూడేళ్ళ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన 76,65, యేండ్ల వ్రుద్ద మ్రుగాళ్ళున్న సమాజంలో "నిర్భయ" సరిపోతుందా?

                                                       

 ఆడదైతే చాలు! దానికి వయసుతో పనిలేదు. మనసుతో పనిలేదు.ఒంటరిగా ఉన్నా, అనాధగా మిగిలినా పాశవికంగా అనుభవించి తీరాల్శిందే. అలా చేస్తేనే వారి ద్రుష్టిలో  మగాడు కింద లెఖ్ఖ.పదేళ్ళ వాడి దగ్గర్ణుంచి, ఎనబై యేండ్ల వాడి వరకు ఇదే మృగాల్ల అభిప్రాయం.

  కరీంనగర్ జిల్లా , కోహెడ మండలం, శ్రీ రాముల పల్లిలో మానసిక వికలాంగురాలైన, పదమూడేళ్ళ బాలిక పై, అదే గ్రామానికి చెందిన సి.రాం రెడ్డి(76),జి. రాజయ్య(65), అనే వ్రుద్ద మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట!. ఒకరు ఒక రోజు, మరొకరు మరొక రోజు అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీరు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి, ఒకరి తర్వాత ఒకరు పాడు చేసినట్లు ఆ అమ్మాయి తల్లి, ఇచ్చిన పోలిస్ రీపోర్టు ప్రకారం తెలుస్తుంది. అసలు ఇలాంటి  ముసలి మ్రుగాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే  నాకు చిన్నపుడు చదువుకున్న  కధ ఒకటి  గుర్తుకు వస్తుంది.

   ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది వయస్సు మీద పడి ముసలది అవటం చేత దానికి వెటాడే శక్తి సన్నగిల్లింది. అందుకని అది ఒక ఉపాయం ఆలోచించి, ఒక బంగారు కంకణాన్ని చేతికి ధరించి, దారీలో పడుకుని ఉండేది. ఆ దారిన పోయే బాటసారులను తమ వద్దకు రమ్మని పిలిచేది. దానికి సందేహిస్తున్న వారిని చూసి, తాను ముసలి దాని నని, తను వయసులో ఉన్నప్పుడు ఎంతో మందిని చంపి పాపం చేసాను అని, కాబట్టి ఈ చివరి దశలో ఎంతో కోంత పుణ్యం చేసి స్వర్గానికి పోవాలనుకుంటున్నాను అని,కాబట్టి తన దగ్గర ఉన్న కంకణం ని దానం గా స్వీకరించి తనకు పుణ్యం చేకూర్చాలని నమ్మబలికితే.ఆ మాటలు నమ్మి ఎవరైన అమాయకులు ఆ పులి దగ్గరకు వెళితే వారి మీద దాడి చేసి తన ఆకలిని తీర్చుకునేదట. ఈ కదలో నీతి ఏమిటంటే ఎవరినైనా గుణమ్ చేత అంచనా వెయ్యాలి తప్పా, వయస్సు చేత కాదు అని. ఇంకొక మటలో చెప్పాలంటే జ్ణానం ఉన్నవాడు వ్రుద్దుడు కాని యేండ్లు మీరిన వాడు వ్రుద్దుడ్డా అని "మిత్ర లాభం" కద చదివిన వారికి తెలుస్తుంది.

  కాబట్టి మన చుట్టూ ఉండే వారిని వారి వారి వయసులను బట్టి అంచనా వెయ్యడం కష్టం. చిన్న వాడైనా, పెడ్డవాడైనా వాడు మగవాడు అని గుర్తుంచుకుని మసలడం ఆడపిల్లలకు మంచిది.చిన్న పిల్లలకు చాక్లెట్లు గట్రా ఆశ చూపి , పాడు పనులు చేసే ముసల్లోలందరూ  , పై కధలోని ముసలి పులి లాంటి వారే . మనుషులు అంతా మంచోల్లే, ఎప్పుడో తెలుసా? వారు ఉంటున్నది కట్టు బాట్లతో కూడిన సమాజం అయినపుడు మాత్రమే. అటువంటి సమాజ నిర్మాణానికి కేవలం "నిర్భయ" లాంటి చట్టాలు ఉంటే సరి పోదు. "సమాజ వెలి" అనే సామాజిక శిక్షలు కూడా ఉండాలి. దనిక, బీద అనే తేడా లేకుండా ఈ "వెలి" శిక్షలను అమలుపరచగలిగితే తప్పా, ఇటువంటి అక్రుత్యాలకు అడ్డుకట్ట వేయడం సాద్యం కాదేమో అనిపిస్తుంది.

  రౌడిలను, శాంతి బద్రతలకు బంగం కలిగించే వారిని నగర బహిష్కరణ చేసే అధికారం  నగర పోలిస్ వారికి ఉంది. అలాగే అత్యచారాలు చేసే మ్రుగాళ్లను "వెలి" వెయ్యడానికి సంబందిత ప్రాంతం వారు వెలి  కోరే హక్కు, చట్టం కల్పించాలి. రౌడి షీట్ ల మాదిరి, రేపిస్ట్ షీట్ లను తెరచి వారి నిత్య క్రుత్యాల మీద నిఘ్హా ఉంచాలి. కొన్నేళ్ళు ఇలాంటి తీవ్ర మైన విదానలు పాటిస్తే తప్పా మన సమాజం లో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడం కష్టం కావచ్చు.  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం