నాటి స్త్రీలకు "పాతివ్రత్యం" రక్షణాయుదం అయితే నేటి స్త్రీలకు "పవర్ ఫుల్ జర్కిన్" రక్షణాయుదమా ?
మన పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా అనేక కధలలో చదివాం. పూర్వ కాలంలో స్త్రీ, పురుషులు నైతిక జీవన విదానానికి కట్టుబడి ఉండేవారు అనేది వాటి సారాంశం. అయితే మహా మహా మగవారు కోడా ఆడదాని విషయంలో చపల చిత్తులై ఉండే వారు అని కూడా కొన్ని గాదల ద్వారా తెలుస్తుంది. ఉదహరణకు, ఇంద్రా-అహల్య గాదా , అగ్నిదేవుడు- ఋషిపత్నుల గాదా. ఈ కదల ప్రకారం ఆ నాడు పవర్పుల్ అయిన దేవతలు సైతం పతివ్రతలను గురించి దుష్ట తలంపులు కలిగి ఉండడానికి జంకే వారు. కారణం ఆ సతీమా తల్లులకు ఉండే ప్రాతివ్రత్య శక్తి ఎవరినైనా బస్మం చేయగలిగేటంత పవర్పుల్ అంట ! సరే అవ్వన్నీ స్త్రీలను అణచిఉంచడానికి పురుషఆదిపత్య సమాజం కల్పించిన కట్టుకదలు అని అనే వారు ఉన్నారు. అయితే ఈ ప్రస్తావనలో అవి కల్పితాలా, వాస్తవాలా అనేది కాసేపు పక్కన పెడితే ఆ నాటి "సతీ మా తల్లుల " భస్మం చేసే శక్తి , వారిని దురాత్ముల లైంగిక దాడుల నుండి కాపాడేది అని అర్దమవుతుంది. అనాది నుండి నేటి వరకు స్త్రీలది ఒకటే పరిస్తితి. రూప