'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?
మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద నోటి కందేదాక గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు . గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , ...