13 మంది మిద మోపబడిన 'వీర్ భూం గాంగ్ రేప్ కేసు' తప్పుడు కేసా !?
ఇటివల భారత దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలలో దిగ జార్చిన ఉదంతం, మరియు స్వాతంత్ర్య బారతంలో అత్యదిక కాలం C.P.M పార్టి వారి ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోని వీరబూo జిల్లా లోని లబ్ పూర్ అనే గ్రామంలో జరిగిన ఘోర ఉదంతం అయిన సంచలన "13 మంది మ్రుగాళ్ళ గాంగ్ రేప్ కేసు" తప్పుడు కేసు అని హిందూ సమితి గౌరవ అద్యక్షుడుగా ప్రకటించుకుంటున్న తపన్ ఘోష్ అనే ఆయన పేస్ బుక్ లో, గూగుల్ లో ఒక చిత్ర సహిత సమాచార టపా పెట్టడం విస్మయ పరుస్తుంది. ఒక వేళ ఆయన ఆరోపిస్తున్నదే నిజమయితే అది ఖచ్చితంగా భారతీయ గిరిజన సంస్క్రుతిని కావాలని అవమాన పరచినట్లే అవుతుంది. వివరాలు లోకి వెళితే , మొన్న ఇరవయ్యో తారీఖున భారతీయ మీడియా ఒక సంచలనాత్మక విషయం ప్రసారం చేసాయి. అదేమిటంటే పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీ...