ఆ దేశం లో అయితే ఉరేస్తారట! ఈ దేశంలో అయితే ఉరేగిస్తారట!
నిన్న ఫేస్ బూక్ లో ఒక పోస్ట్ చూసాను. చైనాకి మనకి అవినీతి విషయంలో ఎంత అభిప్రాయబేదం ఉందో అర్దమవుతుంది.మనo వ్యక్తి ద్రుక్పదమే తప్పా ,సామాజిక ద్రుక్పదం అంతగా లేనివారం.మనవారు అభిమాన నటుడి సినిమా పైరసీ చేస్తే, అంకమ శివాలెత్తి పోతారు, అదే ప్రజల సొమ్ము దోచినోడి గురించి ఒక్క మాటా మాట్లాడలేరు. చైనా లో అవినితికి పాల్పడితే ఉరిశిక్ష విదిస్తారట. అంటే అది మనకు "నిర్భయ" కేసు ఎలాగో వారికి అవినీతి కేసు అలాగ అన్న మాట.మరి వారికి మనకి సామాజిక ద్రుక్పదంలో అంత తేడా ఎలా వచ్చింది? మనం దోపిడిని అంతలా ఎలా సహిస్తున్నాం? పైపెచ్చు అలా దోచిన వారినే మన హీరోలు అంటున్నాం. వారినే పూజిస్తున్నాం. వారికోసం ప్రాణలు సైతం అర్పించడానికి వెనుకాడని అమరవీరులు మన సమాజంలో ఉన్నారు అంటే చైనా వారికి మనకి తేడా ఎక్కడ వచ్చిందో అర్దం కావటం లేదు. ఈ మద్య ఒక మిత్రుడు నాకొక కద లాంటిది చెప్పా డు. అందులో వాస్తవం ఉంది అన్నాడు. మరి ఉందో లేదో మీరే చెప్పండి. చెంగీజ్ ఖాన్ తన దండ యాత్రల సమయంలో ఒక టెక్నిక్ పాటించేవాడు అంట. అతను ఎప్పుడూ తన అనుచరులను ,తను జయించిన రాజ్యాలలో రాజులుగా నియమించలేదట! ఏ రాజ్యాన్ని తను హస్తగతం