కొత్త కోడళ్ల పట్ల చూపాల్సింది ప్రేమా? గౌరవమా?
ఎవరైనా ఒక అమ్మాయి కొత్తగా పెండ్లయి, అత్తవారింట్లో అడుగు పెడుతున్నప్పుడు, భయమూ, బెరుకు ఉండడం సహజం. అత్తవారింట్లో ఎలా మెలగాలో,ముఖ్యంగా అత్త మామల పట్ల, ఆడబిడ్డలు పట్ల ఎలా మసలుకోవాలో తల్లి తండ్రులు చెప్పి పంపుతారు. అయినా కొత్త చోట భర్తతో సహా అందరూ కొత్తవారే కాబట్టి బెరుకుతనం ఉండడం సహజం.మరి అటువంటి కొత్త కోడలు పట్ల మెట్టినీంటి వారు చూపాల్సింది ఏమిటి? సహజంగా తమ కుటుంబం కంటే గొప్ప కుటుంబం (అంతస్తులో) నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్న వారు, ఎక్కువ కట్నం తెచ్చిందని కావచ్చు, లేక తమకంటే ఆమే తల్లి తండ్రులు దనవంతులు అని కావచ్చు ఆమెను చాలా గౌరవంగా చూ...