అమ్మను మించిన దైవం, "అమ్మపాలు " ను మించిన అమృతం, కలవే ఇల యందు ?!!

"అమృతం "! దీని కోసం దేవతలు ,రాక్షసులు మద్య గొప్పయుద్ధం జరిగింది . చివరకు రాజీపడి క్షీర సాగర మధనం జరిపితే అందులోనుండి ఉద్బవించింది జనన మరణాలను లేకుండా చేసె "అమృతం ". ఆప్కోర్స్ అమృతం పంపకం విషయం లోకూడా, మాకు ముందు అంటే ,మాకు ముందు అంటూ దేవ దానవుల మద్య తగాదా ఏర్పడితే ,విష్ణువు "మోహిని అవతార మెత్తి ,దానవులను తన అంద చందాలతో మైమరపింప చేస్తూ ,దేవతలకు మాత్రం "అమృతం పంచుతూ ఉండడం ,దానిని గమనించిన రాహు కేతువులు అనే రాక్షసులు ,దేవతల వేషాలతో వారి పంక్తి లో కూర్చుని తామూ అమృతం తాగబోవడం ,అది గమనించిన విష్ణువు వారి కంఠాలను తన చక్రాయుధంతో ఖండించడం ,అప్పటికే అమృతం గొంతువరకు దిగి ఉండడం తో వారు శిర...