మానవ వాదమంటే మహా భారత "యాదవులను" కించపరచడమేనా?
మహా భారతం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులందరికి పరమ పవిత్రమైన ఇతీహాసం.ఇందులోని ఒక ఘట్టమైన గీతా సారాంశం పవిత్ర గ్రందం. అసలు ప్రపంచంలో ఏ మత గ్రందమైన కొన్ని అబూత కల్పనలతో కూడి ఉంటాయి. వీటిని విమర్శనాత్మక ద్రుష్టితో చూస్తే, మిగిలేది బూడిదే. ఇవి మానవుని అద్యాత్మిక ఆనందం కోసం ఉద్దేశీంప బడినవి. ప్రతిదీ ప్రశ్నించే వ్యక్తి సుఖ శాంతులతో జీవించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మనిషి జీవనానికి తార్కిక జ్ణానం డెబ్బై పాళ్ళు ఉంటే, అలౌకిక ఆనందం ముప్పై పాళ్ళన్న ఉండి తీరాల్సిందే. అంటే బండికి ఇందనం లాగ తార్కిక జ్ణానం పనిచేస్తే, కందెన లాగ అలౌకిక ఆనందం పని చేస్తుంది. అలాంటి అలౌకిక ఆనందం కోసం ఉద్ద్యిశించ బడినవే రామాయణ, మహా భారతాలు. ఇవన్నీ అలౌకిక ఆనందం కోసం మత పరంగా చెప్పబడినవి కాబట్టి అదే ద్రుష్టితో చూడాలి కాని కొంతమంది కి కున్న తార్కిక శక్తి చూపడానికి వీటిని వాడుకోవడం ఏ మాత్రం క్షమించరానిది. ఉదాహరణకు కర్ణుడు సూర్యుడు, కుంతిల పుత్రుడు అని ఉంటుంది. మనకు సూర్యుడు మండే వాడని ఎప్పటిను