అటు చైనా కి గాని ,ఇటు పాకిస్తాన్ కి గాని మన దేశం దేని తో సమానమో తెలుసా ?
గడ్డి పోచతో ! ఎందుకంటే వారి ద్రుష్టిలో మనది ఆఫ్ట్రాల్ అసమర్దుల కంట్రీ అని బావం కాబోలు. మన పొరుగు దేశాలలో ఒకటైన చైనా మన కంటే జనాబా పరంగా యే కాక ఇతరత్రా కూడా ముందున్న దేశం కావచ్చు . కాని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంగించి అప్పుడప్పుడు భారత భూబాగంలోకి చొరబడటం ,అదేమిటని అడిగితే ఆ.... అదంతా ,అలవాటులో పొరపాటు అంటూ వెనక్కి పోవటం లాంటి తమాషాలు చేస్తుంది . ఇంకొక పొరుగు దేశం పాకిస్తాన్ ,ఒక బుడత దేశం . భారతీయులు అందరూ గట్టిగా ఖాండ్రించి ఉమ్మితే , ఉమ్ముకే కొట్టుకు పోయే దేశం . అయినా సరే దానికి మన దేశం అన్నా , మన సైన్యం అన్నా లెక్క లేదు . కార్గిల్ యుద్దం జ్ఞాపకాలు మరవక ముందే మొన్న ఐదుగురు భారతీయ జవాన్లు మీద కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు . అలా కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ వ...