కడుపులో లేకపోయినా ప్రజల కోసమైన కావలించుకోవటం నేర్చుకోవాలి!
ఈ రోజు నందమూరి వంశీయుడు, కరడుకట్టిన సమైఖ్యతా వాది, గౌరవనీయులు కీ,శే. నందమూరి తారక రామరావు గారి తనయుడు, బాలక్రిష్ణ గారి రెండవ కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు అందరూ వచ్చారు.కాని ఈ మద్య, తెలంగాణా, ఆంద్రా ప్రజలు అన్నదమ్ములు అని, వారు కలసి ఉండడమే తన తండ్రి గారి ఆత్మకు శాంతి అని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు హట్టాతుగా (అన్ని పార్టిల అంగీకారంతో చేసినా సరే), విబజన నిర్ణయం తీసుకోవడం వలన, తన తండ్రి ఆత్మ ఘోషిస్తుందని, కాబట్టి తన ఆత్మ కూడా తండ్రి అడుగుజాడల్లో నడవమని ప్రబోదిస్తుంది కాబట్టి, ఆ మేరకే నడచ్కుంటాను అని కన్నీరు కర్చిన హరిక్రిష్ణ గారు కాని, వారి తనయుడు కాని, ఈ రోజు జరిగిన వివాహానికి హాజరు కాలేదట! రాష్ట్ర ప్రజలు ని అన్నా దమ్ములు లా కలసి ఉండాలని చెప్పే ఆ పెద్దమనిషి ద్రుష్టిలో అన్నదమ్ముల అనుబందం అంటే, ఒకరింట్లో జరిగే శుభకార్యానికి, మరొకరు వెళ్ళలేనంతగా ఉండేదా? అని తెలంగాణా వాదులు ఆశ్చర్యపోతున్నారట!అ