కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!
చేసిన పాపం ఊరికే పోదు అనేవారు పెద్దలు. పాపం చేసిన వారిని అదుపు చెయ్యడానికి "నరకలోకం" స్రుష్టీంచి పలాన పాపం చేస్తే పలాన శిక్ష అని క్లియర్ గా చెప్పినా పాపాలు ఆగలేదు సరి కదా యదేచ్చగా, జంకు లేకుండా పాపాలు చేసేసి ఆ దేవుడికి ముడుపు కట్టేసి హుండీ లో వేసేస్తే సరిపోతుంది అన్న నమ్మక్కం వల్ల నేమో కాని పాపాలు ఎక్కువగానే చేసాం. అటువంటి పాపాల్లో "కుటుంబ పాపం" అన దగ్గది , "వరకట్నం" పుచ్చుకొని" ’కన్యా దానం’ స్వీకరించడం.అసలు మన ఆచారం ప్రకారం అత్త మామలు అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. సాదర్ణంగా దానం చేసే వాడిని "దాత" అని పుచ్చుకునే వాడిని "గ్రహీత" అని అంటారు. దాత పట్ల గ్రహీత ఎల్లప్పుడు క్రుతజ్ణత బావంతో ఉండాలి.కాని ఆ దానం స్వీకరించడానికి గ్రహీత దాతను బాదపెట్టేంత కట్నం కోరడం అంటే కచ్చితంగా ఆ స్వీకరించేది ఏదో "పాప పలం" అయి ఉండాలి. అవును మనం అలాగే ఆడపిల్లల్ను పరిగణించాం "అబద్దం ఆడితే ఆడ పిల్