"నారీ నారీ నడుమ మురారి" లా 15 రోజులు ఇల్ల్లా లుతో, 15 రోజులు ప్రియురాలితో గడపమని మొగుణ్ణి ఆదేశించిన లోక్ అదాలత్!
అబ్బ! సహజీవనం నేరమూ కాదు,పాపమూ కాదు అని ఈ దేశ అత్యున్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పు ఆదారంగా ఒక మొగుడు గృహ హింస చట్టం నుండి విముక్తుడై, ఎంచక్కా, 15 రోజులు బార్యతోను, 15 రోజులు గర్ల్ ప్రెండ్ తోను సంసార జీవితం గడపడానికి కోర్టు అనుమతి పొందాడు. వివరాల లోకి వెళితే మద్య ప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పట్టణం లో బసంత్ అనే అతను ఎలక్టర్సిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. అతనికి బార్యా పిల్లలు ఉన్నారు. 10 యేండ్ల క్రితం బార్య ఒంట్లో బాగో లేదని ఒక ఆవిడను తెచ్చి పనికి కుదిర్చాడు. ఎలాగో భార్యకు ఒంట్లో బాగో లేదు కాబట్టి, ఆవిడగారి బాగోగులుతో పాటూ, ఈయనగారి బాగోగులను చూడడం మొదలు పెట్టి , ఇంట్లో ఇల్లాలు పని , పడకటింట్లో ప్రియురాలు పనికి అంకితం అయింది. ఆ తర్వాత బార్యకు ఆరోగ్యం కుదుట పడినా ఈవిడను పనిలోనుంచి తీయలేదు సరికదా , ప్రియురాలు ఉద్యోగం పర్మనెంట్ అయింది. పాపం ఆ పిచ్చి ఇల్లాలు రెండేళ్ళ క్రితం కోర్టులో భర్త మీద కేసు పెట్టింది. ఆ కేసు సారాంశం ఏమిటంటే తన భర్త తనతో గడపకుండా తన ప్రియురాలితోనే ఎక్కువ కాలం ...