మీ "రింగ్ ఫిoగర్ " చెపుతుంది అట ,మీరు 'తిరుగు బోతులా ' కాదా ? అన్న సంగతి !!!
ఇదేదో హస్త సాముద్రికం వాళ్లు చెప్పిన మాట కాదు . భగవద్గిత లో కృష్ణుడు చెప్పింది కాదు . మను స్మృతిలో మనువు చెప్పింది కాదు . సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అసలే కాదు . అసలు సిసలైన ఆక్స్పర్డ్ యూనివర్సిటి శాస్త్రజ్ఞులు పరిశోదించి మరీ చెప్పింది కాబట్టి "విజ్ఞాన బాబులు " నమ్మక తప్పదు మరి . మనిషి యొక్క ప్రవర్తన ని నిర్ణయించడం లో అతడు లేక ఆమె పెరిగిన పరిసరాల ప్రభావంతో పాటు అతని జన్యు వారసత్వం కూడా కారణమవుతుందని ఇదే బ్లాగులో ఒక టపా లో ప్రస్తావించినప్పుడు కొంత మంది శాస్త్రీయ వాదులు ఒప్పుకోలేదు . మనిషి వ్యక్తిత్వాన్ని కేవలం అతని జీవన పరిస్తితులు నిర్ణయిస్తాయి తప్పా ,జన్యు విదానం కాదని బుఖాయించారు .కాని ఈ నాడు నా వాదనకు బలం ఇచ్చే ప్రకటన ఒకటి ఆక్స్పర్డ్ రిసెర్చర్ "రాఫెల్ లోడార్స్కి" గారు ఇవ్వడం నాకు సంతోషం కలిగించే విషయం .ఇంతకి అయన గారు తన పరిశోదన ల ద్వారా కనుగున్న విషయం ఏమిటంటె ఏ వ్యక్తికైతే తన కుడి చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే ఎక్కువ పొడవుగా ఉంటుందో వారు సెక్స్ విషయంలో చాలా చప