వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".
ఈమద్య ఎక్కడచూసినా ప్రజలు కులాలవారీగా, సంఘాలు పెట్టుకుని, అటు పార్టిలను,ఇటు ప్రభుత్వాలను ప్రబావితం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక,చాలకాలం వరకు, అన్ని పార్టిలలోని వారు, ఎంతోకొంత కుల,మత రహిత సమాజాన్ని‘ఏర్పాటుచెద్దామని,కలలుకని,ఆ దిశగా క్రుషిచేసారు. కాని అనాదిగా వెనుకబాటుకు గురైన వర్గాల వారిని సామాజికంగా,ఆర్థికంగా, ఎదిగిన వర్గాలతో సమానం చేయుటకు, వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, మరియు తెగలుగా విభజించి,వారికి కొన్ని రిజర్వేషన్లను ఇవ్వటం ప్రబుత్వాలకు అనివార్యమయింది. దానికోసం ప్రాచీనా కాలం నుండి వస్తున్న కుల వ్యవస్తేనే ప్రామాణికంగా చేసుకుని వారిని తరగతులుగా వర్గీకరించి, సీరీయల్ నెంబర్లు సైతం ఇచ్చి, రెజర్వేషన్లు, కల్పించారు. అంతవరకు ఓ.కే తమ రీజర్వేషన్ హక్కులు రాజ్యాంగ బద్దం కాబట్టి, వాటిని పొందడానికి సంబందిత వర్గాల ప్రజలు "కుల సంఘాలు" పేరుతో ఐక్యమయి తమ హక్కులను పరిరక్షించుకునే హక్కు వారికుంది. కాని విచిత్రంగా రాజ్యాంగ