వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

                                                                 
                                                                                 

 
ఈమద్య ఎక్కడచూసినా ప్రజలు కులాలవారీగా, సంఘాలు పెట్టుకుని, అటు పార్టిలను,ఇటు  ప్రభుత్వాలను  ప్రబావితం చేస్తున్నారు. స్వాతంత్ర్యం  వచ్చాక,చాలకాలం వరకు, అన్ని పార్టిలలోని వారు, ఎంతోకొంత కుల,మత రహిత సమాజాన్ని‘ఏర్పాటుచెద్దామని,కలలుకని,ఆ దిశగా క్రుషిచేసారు. కాని అనాదిగా వెనుకబాటుకు గురైన  వర్గాల వారిని  సామాజికంగా,ఆర్థికంగా, ఎదిగిన వర్గాలతో సమానం చేయుటకు, వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, మరియు తెగలుగా విభజించి,వారికి కొన్ని రిజర్వేషన్లను ఇవ్వటం ప్రబుత్వాలకు అనివార్యమయింది. దానికోసం  ప్రాచీనా కాలం నుండి వస్తున్న కుల వ్యవస్తేనే ప్రామాణికంగా చేసుకుని  వారిని తరగతులుగా వర్గీకరించి, సీరీయల్  నెంబర్లు సైతం ఇచ్చి, రెజర్వేషన్లు, కల్పించారు. అంతవరకు ఓ.కే

   తమ రీజర్వేషన్ హక్కులు రాజ్యాంగ బద్దం కాబట్టి, వాటిని పొందడానికి సంబందిత వర్గాల ప్రజలు "కుల సంఘాలు" పేరుతో ఐక్యమయి  తమ హక్కులను పరిరక్షించుకునే హక్కు వారికుంది. కాని విచిత్రంగా రాజ్యాంగం గుర్తించని వర్గాల వారు కూడ తమ "కులాల" పేరుతో సంఘాలు పెట్టుకోవడం ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. "కుల’ రహిత సమాజాన్ని నిర్మించాలన్న రాజ్యాంగ స్పూర్తికి ఇది విరుద్దం కాదా?ఇటువంటి సంఘాలను ప్రోత్సహించడం ప్రభుత్వంలోని పెద్దలకు,ఏ విదంగా కరెక్ట్  అనిపిస్తుందో అర్థం కావడం లేదు.ఆ "కుల" సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు ప్రబుత్వ పెద్దలు హాజరు కావడం "ప్రవర్తనా నియమావళికి" వ్యతిరేఖంగా ప్రకటించాలి.

  "కుల సంఘాలు" పెట్టుకునే హక్కు కేవలం రిజర్వేషన్ పొందే వర్గాల ప్రజలకు మాత్రమే ఉండాలి.ఒక పక్కా ప్రణాలిక బద్దంగా,ముందు "కులాదిక్యత నిర్మూలన" చేస్తే, ఆ తర్వాత,పరిణామ క్రమంలో"కులం" అనేది మాయం కావచ్చు. కాబట్టి, చట్టాలు గుర్తించని"కులాల" సంఘాలను, తక్షణమే ప్రబుత్వాలు నిషేదిస్తే మంచిదేమో?  

Comments

  1. రాజ్యాంగం 'దత్తు చేసుకున్న' కొన్ని కులాలకే సంఘాలు పెట్టుకునే అర్హత వుండాలనడం అసంబద్ధం, పౌరుల కుల హక్కులకు కాలరాసినట్టే. దత్తు చేసుకోవాలనే డిమాండ్లు నెరవేరడంలో కుల సంఘాల పాత్ర ఎంతైనా వుంది. ఈ దత్తు కులాల లిస్టు పెరిగేదే కాని తరిగేది కాదని మనువు గార్లు గమనించాలి. నన్నడిగితే... 100% కోటాలు మన టార్గెట్ కావాలి. :)

    ReplyDelete
  2. ఒక ప్రక్క కుల రహిత సమాజం కావాలని చెప్పేవారే, "కుల సంఘాలు" పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?.ఒక వేళా వారికి రిజర్వేషన్లు కావాలంటె, "మేమెంతమందో మాకన్ని సీట్లు" అనే ప్రాతి పదిక మీద "జనాబా అదారిత రాజ్యాదికార సిద్దాంతం" అమలు కోసం ప్రబుత్వాల మీద ఒత్తిడి తేవాలి. పైకి కులం అంటే అసహ్యంగా మొహం పెట్టే వారే, తమ కుల సంఘాలను రహస్య అజెండ ద్వారా ప్రోత్సాహిస్తున్నారు.దీన్ని ఖండించవలశిన అవసరం ఉంది.

    ReplyDelete
    Replies
    1. /"మేమెంతమందో మాకన్ని సీట్లు" అనే ప్రాతి పదిక మీద "జనాబా అదారిత రాజ్యాదికార సిద్దాంతం" అమలు కోసం ప్రబుత్వాల మీద ఒత్తిడి తేవాలి./

      ఏకీభవిస్తున్నా...
      "మేమెంతో మాకంత" ప్రాతిపదికన పార్టీల టికట్లు, మంత్రి పదవులు, సివిల్ సర్వెంట్లు, డాక్టర్ల పదవులు ఇచ్చేయాలంటారు? 'ప్రతిభ' అని వాదించే వారికి దేశ బహిష్కరణ విధించి బయటి దేశాలకు తరిమేయాలి, జైళ్ళలో కుక్కాలి.

      Delete

  3. మేమడిగింది,"రాజకీయ రిజర్వేషన్లు". అవినీతి రాజ్యంలో "ప్రతిభకు" అర్థం దొరకడం కష్టమే.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం