20 రోజుల నగర కాలుష్యాన్ని పట్టించుకోని నాస్తికులుకు , 12 రోజుల నదీ కాలుష్యం గురించి అడిగే నైతిక అర్హత ఉందా?
గోదావరి నదీ పుష్కరాలు. 12 యేండ్ల కొకమారు వచ్చే పవిత్ర స్నానాల పండుగ. ప్రజలు తమ తమ పితృ దేవత ల సంస్మర్ణార్దం పిండాలు , తర్పణాలు నదిలో విడచి వారి పట్ల తమ కున్న భక్తీ పూర్వత గాడా భిమానం తెలియ చేసుకునే తరుణం.అలాగే నదీమ మ తల్లికి పూజలు చేసి తమ ను చల్లగా చూడాలని తమకు తోచిన రీతిలో కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం. మరి తమ తోటి ప్రజలు ఎంతో పవిత్రంగా బావించే కార్యక్రమాలను తమకు ఇష్టం ఉన్నా లేక పోయినా మౌనం పాటించడం ఇంగిత జ్ఞానం ఉన్న నాస్తికుల పని. కాని తగుదునమ్మా అని , ఆస్తికుల మనోబావాలు గాయపడేటట్లు ఫేస్ బుక్ లో , ఇతర మీడియా మాధ్యమాల్లో వ్హ్యాక్యలు చేయడం , పోస్టులు పెట్టడం, చర్చలు నిర్వహింఛి కీచకానందం పొందడం ఎంతవరకు సబబు? వీరు చేసే వ్యాఖ్యలు హిందువుల మనసులను గాయపరచ వచ్చు కాని , తమ సాంప్రదాయ నదీమ తల్లి పూజలు విషయం లో కాని , పితృదేవత పూజాకార్యక్రమ నిర్వహణ లో వారి అకుటింత దీక్షను ఏ మాత్రం చెక్కు చెదరనీయవు. దీనికి రుజువు ఈ 12 రోజులలో కోట్లాది మంది ప్రజలు గోదావరి నదిలో ఆచరించిన పుణ్య స్నానాల రికార్డులే .
హిందూ కార్యక్రమాలను డైరెక్టుగా అంటె మత విషయం లో జ్యోక్యం చేసుకున్నట్లు ఉంటుంది కనుక , అది చట్ట పరంగా నేరం కనుక , కొంత మంది తెలివి గల నాస్తికులు , "గోదావరి నది పుష్కర స్నానాలు వలన కలుషితం అవుతుంది అని, ఇది పర్యావరణానికి హాని అని గగ్గోలు పెడుతూ మీడియాల ద్వారా తెగ ఉదర గొట్టెస్తున్నారు. నిజంగా గోదావరి నదికి ఆస్తికులు చేసే 12 రోజుల స్నానాలు వలన అంత హాని జరుగుతుందా? ఆప్ట్రాల్ భద్రాచలం దగ్గరకోటి మంది చేసే పుణ్య స్నానాలు వలన కలిగే కాలుష్య ప్రమాదం కన్నా , అక్కడే ఉన్న I.T.C కంపెనీ వారు వారం రోజుల పాటు నదిలోకి విడుస్తున్న రసాయనాలు కలిగిస్తున్న కాలుష్య హాని ఎంతో ప్రమాదమైనది. అయినా ఇది నాస్తికుల కళ్ళకు కనపడదు. ఎందుకంటె ప్యాక్టరిలు ఉంటేనే కార్మికులు ఉంటారు . వారు ఉంటేనే తమ సంస్తలు చల్లగా ఉంటాయి కాబట్టి.
గత 20 రోజులుగా రెండు రాష్ట్రాల్లో మునిసిపల్ కార్మికులు.ప్రభుత్వాల మీద సమ్మె చేస్తున్నాం అంటూ ప్రజలను రోగాల బారిన పడేట్లు చేస్తున్నారు. వారు చెత్తను తొలగించక పోవడం వలన నగరాలు పెద్ద డంపింగ్ యార్డులుగా మారి పోయాయి. పైన చిత్రంలో ఉన్న ఖమ్మం నగరానికి చెందిన పరిస్తితే అన్నీ నగరాల్లో ఉంది. 20 రోజులు నిల్వ ఉంచిన చెత్త వలన ఎలాంటి బాక్టీరియా అభివృద్ధి చెందుతుందో , దాని వలన ప్రజలకు ఎలాంటి రోగాలు వస్తాయో , నాస్తికులు చెప్పరు. ఎందుకంటె కార్మికులు వెనుక ఉన్న ప్రదాన పార్టీలు వారి వే కాబట్టి. కాని నదిలో 12 స్నానాలు చేస్తే వ్యాపించే వైరస్ గురించి యమ పబ్లిసిటి ఇస్తారు. అదీ కూడా భక్తులు మీద ప్రేమ తో కాదు, వారు ఎంత మూర్కులో తెలియపరచాలని తహ తహ.
నిజంగా నాస్తికులకు వారి కనుసన్నల్లో నడచే పార్టీలకు ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ద ఉంటె తక్షణమే మున్సిపల్ కార్మికులు సమ్మె విషయం లో జ్యోక్యమ్ చేసుకుని కార్మికులకు నచ్చ చెప్పాలి . ప్రభుత్వం ఒక మెట్టు దిగినప్పుడు తాము ఒక మెట్టు దిగడం సంప్రదింపుల్లో బాగం అని చెప్పాలి. ప్రభ్త్వానికి, కార్మికులకు మద్య అనుసందాన కర్తగా వ్యవరించి తక్షణమే సమ్మెను విరమింప్స చేయాలి. వారి సమ్మె వలన అంతిమంగా ముప్పు కలుగుతుంది ప్రజల ఆరోగ్యాలకే కాబట్టి విచక్షణ జ్ఞానంతో వ్యవరించాల్సిన బాద్యత , దేవున్ని నమ్మక్క పోయినా ప్రజలను నమ్మే నాస్తికులకు , వారు నాయకులుగా ఉన్న పార్టీలకు ఉంది. ఈ రోజుతో పుష్కరాలు ముగుస్తున్నాయి. నాస్తికులు ఆవేదన చెంద్తున్న నదీ కాలుష్యం ఆగి పోతుంది. అలాగే కార్మికులు, ప్రభుత్వాలతో మాట్లాడి సమ్మె విరమింపచేస్తే నగర కాలుష్యం ఆగి పోతుంది. ఆ పని చెయ్యమని నాస్తిక నాయకులను కోరుతున్నాం .
Comments
Post a Comment