నాడు హిందూ పాలకులను తెల్లవాడు విడదీసినట్లే , నేడు తెలుగు పాలకులను "వాళ్ల మతస్తులు విడదీస్తున్నారా ?!!!

                                                                             

           
                         ఓటుకు నోటు కేసు పుణ్యమాని ఆంద్రా , తెలంగాణా పాలకుల  మద్య విబేదాలు మరొక సారి రాజుకుని , ఇరువైపులా మీసాలు మెలేసుకుని , తొడలు చరచుకునే దాకా వెలుతున్నాయి. ఇరువైపులా మెజార్టి ప్రజలు  అంతో ఇంతో జ్ఞాన వంతులు కాబట్టి , ఇదంతా రాజకీయ డ్రామాలో బాగమేలే అనుకుని మెదలకుండా జరిగే దానిని చూస్తున్నారు. లేకుంటే రాజకీయ నాయకులు కి శివాలెత్తినట్లు , మెజార్టి సామాన్య ప్రజలకు శివాలెత్తితే , ఈ  పాటికి పర్యవసానం వేరుగా ఉండెది.

 నాకు తెలిసినంత వరకు K.C.R గారు కల్లా కపటం లేని ముక్కు సూటి మనిషి. తన మనసులో ఉండెది వెళ్ళగ్రక్కుతాడు. అయన వాడె బాష  కొంత మందికి బాద కలిగించినా, అయన నైజం తెలిసిన వారు అయన  వలన హాని  జరుగుతుందని అనుకోరు. అయన ఆలోచనలు తెలంగాణా ప్రాంత స్వార్దం గురించి ఉన్నప్పటికి , కోర్టుల ఆదేశానుసారం తన  పాలన ఉండాలనే అయన కోరుకుంటాడు కాబట్టి, ప్రజాస్వామ్య వాదులు అయన పాలన గురించి అంతగా బయపడవలసిన పని లేదు. ఈ  విషయం హైదరాబాద్ లోను, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆంద్రా సెటిలర్స్ మేదావులకు తెలుసు కాబట్టే , వారు ఆందోళన చెందటం లేదు .

      కాని ఎట్టొచ్చి అంద్రా లోని కొంత మంది స్వార్ద పర రాజకీయ నాయకుల వలననే ఆంద్రా , తెలంగాణా పాలకుల మద్య తరచూ గొడవులు జరుగుతున్నాయి. అంద్రా లో ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు పని కట్టుకుని చేసిన కుట్ర వలననే "ఓటుకు నోటు కేసు " బయటకు వచ్చింది .ఈ  కేసుకు సంబందించినంత వరకు ముక్యమైన వ్యక్తులు ఒకే మతానికి చెందిన వారు కావటం , ఈ కేసు గురించి తెలంగాణా రాజకీయ నాయకులు కంటె  , ఆంద్రా వారే ఎక్కువ కలుగచేసుకుంటూ , తమ ప్రత్యర్దులను ఎలా దెబ్బ తీయాలా అని ఆరాట పడడం చూస్తుంటె , ఈ  కేసు వెనుకాలా కొన్ని ఆంద్రా కు చెందిన అన్య మత శక్తులు ఎలా పని చేస్తున్నాయో ఇట్టె అర్దమవుతుంది. బహుసా ఆంద్రా సర్కార్ , పట్టు విడవ కుండా  తమ రక్త చందనం స్మగ్లింగ్ ని దెబ్బ తీస్తున్న విదానాన్ని చూసి సహించ లేక , ఏదో రకంగా ప్రబుత్వాన్ని ఇరకాటం లో పెట్టాలనే ,తెలంగాణా లోని కొంత మందిని , తమ డబ్బుతో ప్రలోభ పెట్టి, వారి ద్వారా రేవంత్ కి ట్రాప్ పెట్టినట్లుంది . K.C.R అంటె ఒంటి కాలు మీద లేచే రేవంత్ రెడ్డి ఇలా ఆంద్రా అన్యమత  శక్తులు పన్నిన ట్రాప్ లో ఈజిగా చిక్కుకున్నాడు.

     తన ప్రభుత్వాన్ని డబ్బులుతో పడగొటాలని ఆంద్రా నాయకత్వం కుట్ర పన్నిందని , ఆంద్రా కుట్రదారుల డబ్బులు తీసుకుని పని చేసే తెలంగాణా అధికారులు చెప్పడంతో , సహజంగానే K.C.R గారు అగ్గి మీద గుగ్గిలం అయి ఉంటారు . తన ప్రభుత్వాన్ని కూలద్రోసేవారి పీచమణచమని అధికారులను ఆదేసించి ఉంటారు. అటు KCR ప్రభుత్వం తీసుకునే చర్యలకు డిఫెన్స్ గా సెక్షన్ 8 తో పాటు , పోన్ టాపింగ్ కేసులను ఆంద్రా సర్కార్ చేపట్టింది. ఇలా ఆంద్రా అన్యమత  శక్తులు పన్నిన పన్నాగం వలన రెండు తెలుగు  రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటు , చివరకు ఇది అంద్రా ,తెలంగాణా ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టెలా పరిస్తితులను దిగ జారుస్తున్నారు. ఇక పోతే కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు అంటె ఎంత సానుకూలత ఉందో , K.C.R గారు అన్నా అంతే సానుకూలత ఉంది. కాబట్టి  ఇరువైపులా కేసుల విషయం లో సంయమనం పాటించి సర్దుకు పొమ్మనే చెపుతున్నారు. ఇరు ప్రబుత్వాలు ఒక పట్టుదలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఇద్దరి మద్య ఆరోగ్యకరమైన పోటి ఉండాలే తప్పా , ఇలాంటి లత్కోరి పంచాయతిల వలన ఎవరికీ ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వాలో అస్తిరత్వం ఉంటె లాబపదేది స్మగ్లర్లు, అరాచక శక్తులే తప్పా , సామాన్య ప్రజలు కాదు అని ఇరువైపులా పెద్దలు గ్రహించాలి.

         "మంచి మిత్రున్ని ఎన్నుకునే అవకాశం మనకుంది కాని , మంచి పొరుగును లేక అనుకూలమైన పొరుగును  ఎంచుకునే అవకాశం ఉండదు " అన్న మన రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మాటలలో ఉన్న అంతరార్దాన్ని గ్రహించి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబందాలు కొనసాగించడమే  వివేకవంతులైన పాలకుల లక్షణం . తెలంగాణా లో KCR నాయకత్వం , ఆంద్రాలో చంద్రబాబు నాయకత్వం కొన్నేళ పాటు నిరాటంకంగా సాగితేనే ఇరు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయి. ఎవరు ఏమనుకున్నా, ప్రజల్లో  వీరిద్దరి చరిష్మా కు ఇప్పట్లో డొకాలేదు . మన ప్రదాన మంత్రి గారి "స్మార్ట్ , అమృత్ నగరాల  అభివృద్ధి " "డిజిటల్ ఇండియా " లాంటి పదకాలు సక్సెస్ కావాలంటే తెలుగు రాష్ట్రాలకు ఈ ఇరువురి నాయకుల నాయకత్వం ఎంతో అవసరం. 

     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం