విజయలక్ష్మీ "బర్త్ డే " నాడే ఆమెను చంపి , బీర్ తో "డెత్ డే " సెలబ్రేట్ చేసుకున్నభర్త "నారాయణ రెడ్డి " !!!
భార్యా భర్తల సంబందాలను అనుమానాలు , అపోహలు ప్రబావపరచినంతగా , వాస్తవాలు ప్రబావపరచవేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని ఉదంతాలు గురించి వింటుంటె. భార్యకైనా , భర్తకైనా తన జీవిత బాగస్వామి ప్రవర్తన మీద అనుమానం కలిగితే తక్షణమే దానిని తీర్చుకోవడం మంచిది. అలాగే తన ప్రవర్తన మీద , తన జీవిత బాగాస్వామికి అపోహ ఏదో కలిగిందని బావించిన వారు కూడా , వారిది ఒట్టి అపోహ లేక అనుమానమే అని తేల్చి పారేయడం మంచిది. లేకుంటే అదే అనుమానం పెనుభూతమై చివరకు "ప్రాణ హాని " జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్తను కూల్చుతున్న ప్రదాన కారణాల్లో జీవితబాగస్వాముల ప్రవర్తన పట్ల అ...