భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి "

                                                                   
   


          నేను ఇంతకు ముందు ఇదే బ్లాగులో కొన్ని టపాలు లో అనుమానపు మొగుళ్ళు గురించి ప్రస్తావించడం జరిగింది . మొన్నీ మద్యనే  "శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది ! అనే టపా పెట్టడం జరిగింది . అందులో అనుమానం జబ్బుతో  ఒక భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో అర్దమవుతుంది . తన భార్యా పిల్లలను పరమ కిరాతకంగా చంపి , పైపెచ్చు తన పాప విముక్తి కోసం కాశికి వెళ్ళాడు. ఇలా భర్త క్రిమినల్ గా మారడానికి అతనిలో ఉన్న "అనుమానం" అనే జబ్బు. ఈ జబ్బు ఎంతకు తెగిడిస్తుందో ఒక వాస్తవ ఉదంతం ద్వారా తెలియ చేస్తాను.

  నాకు తెలిసిన భార్యా భర్తలు ఉన్నారు. వారిది నిజంగా అపురూపమైన జంట . అది ఒకప్పటి మాట! కాని అదే జంట, ముప్పై ఏండ్ల పాటు కలసి కాపురం చేసి ఇద్దరు బిడ్డల్ని కని , వారిని ప్రయోజకులు చేసిన జంట , ఇప్పుడు విడి విడి గా ఉంటున్నారు . ఒకప్పుడు భార్యా లేనిదే క్షణం గడవని భర్త , ఇప్పుడు ఆమె కనిపిస్తే చంపేస్తాను అని వీరంగం వేస్తున్నాడు. తన భార్య కులట అని ప్రచారం మొదలెట్టాడు. అసలు అయన దుష్ ప్రచారం ఎంత నీచ స్తాయికి వెళ్లిందో, వారి జీవితంలో జరిగిన  ఒక సంఘటన ద్వారా తెలియ చేస్తాను.

                                                                     
పెళ్ళాం హాయిగా నిద్రపోతున్నా , అనుమానం మొగుడికి, ఆమె రోజంతా ఎవరితో మాట్లాడిందన్న అనుమానం !!


                 వారిద్దరి మద్య గొడవలు రావడానికి మూల కారణం ఒకటి ఆమె కోరుకునే కొద్దిపాటి  ఆర్దిక స్వేచ్చా అయితే , రెండవది అతనిలోని అనుమానం పిశాచి . దీని కోసం పంచాయతి పెట్టారు . ఆ పంచాయతిలో పెద్దమనుషులు వారివురికి నచ్చ చెప్పి కాపురం చేసుకోందని సలహా ఇచ్చారు. అందులో ఒక పెద్ద మనిషి అతని అనుమానం ప్రవర్తన మీద మందలించి,ముప్పై యేండ్లు కాపురం చేసిన భార్యను అలా ఇతరులతో అంటగట్టడం అమానుషం అని చెప్పాడు . అంతే !  తెల్లారి  నుంచి ఆ పెద్దమనిషికి తన భార్యకు అక్రమ సంబందం ఉందని ప్రచారం చేయడం మొదలెట్టాడు. దానితో పాపం ఆ పెద్దమనిషి ఆ  మొగుడు పెళ్ళాల. పంచాయితీకి పోవడమే మానుకున్నాడు. ఇతర పెద్దలు కోడా ఎవరూ అతని ప్రవర్తన తప్పు అనే సాహసం చేయలేక పోతున్నారు. ఆమె పరిస్తితి "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని " అన్న చందానా తయారైంది . నిజంగా ఇటువంటి అనుమానం జబ్బులు ఉన్న భర్తలు లేక భార్యాలతో జీవిత బాగస్వాములు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తలచుకుంటేనే భయం వేస్తుంది. 

 ఈ అనుమానం జబ్బు ఉన్నవారు తమకు ఉంది జబ్బు అని గుర్తించరు . ఒక వేళ అడి జబ్బే అని గట్టిగా చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లి వైద్యం చేయిద్దామంటె , వారికీ భార్యను అంటగట్టడమో , లేక వేరే ఏదైనా అంటగట్టి ప్రచారమో చేస్తారు కాబట్టి ఎవరూ ముందుకు రారు. అసలు రోగి కంటే ముందు సమాజం అనుమానం ని ఒక తీవ్ర మానసిక సమస్య గా పరిగనించాలి . కాని అలా జరుగటO లేదు. ఒక కుటుంబ స్త్రీని పరాయి వ్యక్తులతో అంగట్టడమ్ ని కూడా వెకిలిగా ఎంజాయి చెసే దౌర్బాగపు వ్యవస్థ మనది. అందుకే అనుమానపు పిశాచాలు సమాజం లో ఉండగలుగుతున్నాయి. పిచ్చి పట్టి రాళ్ళు విసురుతున్న వ్యక్తులను "మెంటల్ హాస్పిటల్లో " చేర్పించమనే సమాజం , అనుమానం తో బాధపడే వారిని మాత్రం క్రిమినల్స్ గా చూడాలంటుంది. ఇది ఎంత వరకు సమంజసం. ? ఈ విషయంలో  అవసరమైతే , కోర్టుల జ్యోక్యంతోనైనా "అనుమానపు వ్యక్తులకు "  ట్రీట్ మెంట్ ఇచ్చి కుటుంబాలను కాపాడుకోవలసిన బాద్యత ఆ యా కుటుంబ సబ్యులు, ఇతర బందువుల పై ఉంది. అంతే కాని పోలిస్ కేసులు పెట్టి జైలులో పెట్టినా , మెత్తగా తన్ని మూలన కూర్చో బెట్టినా , "అనుమానపు పీనుగు " అని నిర్లక్ష్యం చేసినా అభివృద్ధి చెందింది అంటున్న మన వైద్య పరిజ్ఞానానికి గాని , మన నాగరికతకి కాని అర్దం లేదు .  

                 అనుమానం అనేది పెద్ద రోగం అని గొప్ప ప్రచారం జరగాలి . ఇది ఎయిడ్స్ కంటె భయంకరమైనది. కుటుంబాలను కోల్చివేస్తున్న ప్రదాన కారణాల్లో ప్రదానమైనది ఇది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పదకంలో ఈ జబ్బును కూడా చేర్చాలి . లేకుంటే ఈ పిశాచం  మన కుటుంబ వ్యవస్తను ఇంకా ఎంతగా నాశనమ్ చేస్తుందో!/

                     
 నేను ఇది ప్రస్తావించడానికి కారణం  డాక్టర్ N.B. సుధాకర్ రెడ్డి  గారు ఈ రోజు పేస్ బుక్ లో పెట్టిన ఇమేజ్ తాలూకు వివరాలు . అయన ఏమి చెప్పారో అదే పై భార్యా భర్తల విషయంలో జరిగింది.  అది ఏమిటో పై నున్న చిత్రం లో చోడండి.     ఇప్పుడు చెప్పండి . పైన తెల్పిన " భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి " అయిన భర్తకు వైద్యం కరెక్టా ? జైలుకు పంపడం కరెక్టా ?

                              ( Republished post 26/11/2014)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.