"నాగులు తిరిగే నాగార్జున యూనివర్సిటిలో నవ్వినా చేటే " అని నిరూపించిన రిశితేశ్వరి ఉదంతం.

                                                                             
Rishiteswari . 

                                   
                            ఆ అమ్మాయి పేరు రిషికేస్వరి . స్వస్థలం వరంగల్. తల్లి తండ్రులకు ఒక్కతే కూతురు. తండ్రి అంటె వల్లమాలిన ప్రేమ . తను లేకుండా అయన కనీసం సినిమాకి , హోటల్ కి కూడా వెళ్ళలేడని తెలిసిన ఆ అమ్మాయి , తన తండ్రి ఎన్నడూ తన వలన తల వంచుకోకూడదని తలపోసింది . తను ఇష్టపడే   ఆర్కిటెక్ఛర్ కోర్సు ను అభ్యసించ దానికి నాగర్జున యూనివర్సిటి కి  వచ్చింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంటె జ్ఞానవంతుల నిలయం అనుకుంది . కాని అక్కడ కొన్ని విష నాగులు ఉన్నాయని , అవి కుల గర్వంతో , ధన గర్వంతో విర్రవీగుతుంటాయని , అవి  మనుషుల హవబావాలను తమకు నచ్చిన విదంగా అన్వయించుకుంటాయని , వాటికి దూరంగా ఉండక పోతే కీడు తలపెడతాయని తెలియక ఎప్పుడూ తను నవ్వుతూ , అందరిని నవ్వించాలని చూసేది . అదే ఆమే చావుకు కారణమైంది అంటే సభ్య సమాజం నివ్వెర పోక తప్పదు.

       అలా నవ్వే ఆ నవ్వుల తల్లిని తప్పుగా అర్దం చేసుకున్న సీనియర్ లు రాగింగ్ పేరుతో ఆమెను హింసించారు. హాస్టల్ రూం లో తోటి ఆడపిల్లలే ఆమెను అర్దనగ్నంగా తిప్పి ఆమే చిత్రాలను సెల్ పోన్ ద్వారా చిత్రీకరించి మగపిల్లల్ల కు ఇచ్చారు అని చెపుతున్నది నిజమే అయితే, ఖచ్చితంగా వారు మనుషులకు పుట్టిన వారు అయి ఉండరు. నవ్వుతూ తమ వెంట ఒక ఆడపిల్ల తిరిగితే దానిని తప్పుగా అర్దం చేసుకుంటారా? దీనికి బంగారం లాంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది , ర్యాగింగ్ ఏ స్తాయిలో చేసారో ఇట్టె అర్దమవుతుంది.  దీని బట్టి చూస్తే సాంప్రాదాయ వాదులు చెప్పే "ఆడపిల్ల అతిగా నవ్వ కూడదు " అనే సూత్రం నిజమే అనిపిస్తుంది కదా! మనల్ని అర్దం చేసుకోలేని వారు స్త్రీలైనా , పురుషులైనా వారి స్నేహం వదిలివేయడమే అన్ని విధాలా శ్రేయస్కరం అని రిశికేస్వరి ఉదంతం తెలియ చేస్తుంది.

        చెపితే ఆశ్చర్య పోతారు కాని ,  ఉన్నత చదువులు చెప్పే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో   సామాజిక వర్గాల పేర్లతో   గ్రూపులు కట్టి విద్యార్దులు తిరుగుతుంటారు. మరి తల్లి తండ్రులకు , అద్యాపకులకు ఈ  విషయం తెలుసో , తెలియదో నాకు తెలియదు. వామపక్ష బావ జాల ప్రబావం ఉన్న విద్యాలయాల్లో  కుల పరంగా గ్రూపులు కట్టడాన్ని నీచంగా పరిగనిస్తారు అప్కోర్స్ కాకుంటే పార్తీల పరంగా వారు విడిపోయి ఉంటారు.కాని సామాజిక వర్గాల బావజాలం ఉన్న చోట కంటె  వామపక్ష బావజాలం ఉన్న చోట  రాగింగ్ సంస్క్రుతి  తక్కువే అని చెప్పవచ్చు. కాని దన గర్వంతో , కుల గర్వంతో బిరుసు ఎక్కిన తలలకు తాము ఏమి చేసినా చెల్లు బాటు అవుతుందనే ఒక అపోహ ఉంది. కాని కాలం కలసి రాకపోతే వారిని అన్ని వేళల రక్షిస్తారు అనుకునే వారే, తాము శిఖ్షించబడుతున్న వేళ ,  ఏమి చెయ్యలేని నిస్సహాయ స్తితిలోకి నెట్టబడతారు అని వారు తెలుసుకోవడం మంచిది.

       ఎవరినైనా కాపాడేది తాము అనుసరించే దర్మం. తోటి విద్యార్దుల పట్ల ఉండాల్సింది సోదర బావమే . మిగత్తవి ఎమన్నా ఉంటే కాలేజి చదువులు పూర్తి అయి, లైఫ్ లో సెటిల్ అవుదామని నిర్ణయించుక్కునేటప్పుడె . ఇప్పుడు చూడండి . రిషికేస్వరి తల్లి తండ్రులకు ఒక్కతే కూతురు. వారి కడుపు కోత ను ఎవరు తీర్చగలరు? అద్యాపకులు అంటే గర్ల్స్  స్టుడెంట్స్ తో  డ్యాన్సులు వెయ్యడం కాదు. తల్లి తండ్రుల బాద్యతను తాము తీసుకుని ,పిల్లలను సేఫ్ గా తిరిగి తల్లి తండ్రులకు అప్పగించడం . అది చెయ్యలేక పోతే , క్లబ్ లోకి వెళ్లి డాన్సులు వేసుకుంటే డబ్బుకు డబ్బు, ఆనందానికి ఆనందం వస్తుంది అని , లేడి స్టుడెంట్స్ తో తైతక్క లాడిన , రిషికేశ్వరి ప్రిన్సిపాల్ లాంటి వారు గుర్తించాలి.

     ఇప్పటికైనా సీమాంద్రా ముక్యమంత్రి గారు  మరియు విద్యా శాఖా  మంత్రి  గారు , తమ కళాశాలల్లో  ఉన్న  రాగింగ్ భూతంతో  తో పాటూ , సామాజిక వర్గాల  గ్రూపుల సంస్కృతిని సమూలంగా పెకిలించి వేయడానికి కఠిన చర్యలు  తీసుకోవాలని ఈ టపా ద్వారా కోరడమైనది. లేకుంటే ఇటువంటి పాపాలు  మీ మెడకు చుట్టుకోవడం ఖాయం.
       ఆ అమ్మాయి తన తల్లి తండ్రులకు రాసిన లెటర్ ని చదివిన వారి కళ్ళ వెంబడి నీరు రావడం ఖాయం.
                          
                    Republished post
     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!